ఈ వస్తువులను అసలు దానం చేయకండి.. చేస్తే, పుణ్యానికి బదులు పాపాన్ని కొని తెచ్చుకున్నట్లే..!

Donation: దానంగా వేటిని పడితే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం రావడం కాదు కదా, పాపం పెరుగుతుంది. జీవితం  క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి చేరుతుంది. ఇంకా చేయకూడని వస్తువులను దానం చేయడం వల్ల అపకీర్తి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇంతకీ పండితుల ప్రకారం ఏయే వస్తువులను దానం చేయకూడదో..

ఈ వస్తువులను అసలు దానం చేయకండి.. చేస్తే, పుణ్యానికి బదులు పాపాన్ని కొని తెచ్చుకున్నట్లే..!
Donation
Follow us

|

Updated on: Sep 05, 2023 | 1:33 PM

Donation: సనాతన హిందూ ధర్మంలో దానధర్మాలకు ప్రముఖ స్థానం ఉంది. ఆకలి అన్నవారికి అన్నం, దప్పిక అన్నవారికి నీరు మాత్రమే కాక చేయిచాచిన వారికి సిరిసంపదలను దానం చేసిన సందర్భాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దానం చేయడం వల్ల అర్థికి సాయం, దాతకు కీర్తి, పుణ్యం అందుతాయని పెద్దలు చెబుతుతుంటారు. అయితే దానం చేసేవారు ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే.. దానంగా వేటిని పడితే వాటిని ఇతరులకు ఇవ్వకూడదు. కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల పుణ్యం రావడం కాదు కదా, పాపం పెరుగుతుంది. జీవితం  క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి చేరుతుంది. ఇంకా చేయకూడని వస్తువులను దానం చేయడం వల్ల అపకీర్తి పాలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇంతకీ పండితుల ప్రకారం ఏయే వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉక్కు వస్తువులు, పాత్రలు: దారిలో లేదా ఎక్కడైనా దొరికిన ఇనుప, రాగి వంటి లోహం వస్తువులను ఇంటికి తీసుకురాకూడదని, వాటిని ఉపయోగించుకోకూడదని పెద్దలు చెప్పడాన్ని మీరు గమనించే ఉంటారు. అది మాత్రమే కాదు, ఇనుప రాగి వస్తువులను దానం చేయడం కూడా దాత, దాత కుటుంబానికి మంచిది కాదు. ఇలాంటి వస్తువులను దానం చేయడం వల్ల అభివృద్ధి క్షీణిస్తుందని, లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెళ్లిపోతుందని, ఆరోగ్యానికి మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.

బట్టలు: చాలా మంది తమ పాత బట్టలను దానం చేస్తుంటారు. ఇలా చేయవచ్చు, కానీ చిరిగిన బట్టలను మాత్రం అసలు దానం చేయకూడదు. చినిగిన బట్టలను దానం చేయడం కుటుంబానికి అశుభం, అభివృద్ధికి ఆటంకం. ఇలా చేయడం వల్ల వ్యాపారాలకు నష్టం, జీవనోపాధికి లోటు ఏర్పడతాయని కాబట్టిన చినిగిన వస్తువులను దానం చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్ వస్తువులు: ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో అవసరం తీరిపోయిన ప్లాస్టిక్ వస్తువులను కొందరు ఇతరులకు దానం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చేసినవారి ఇంటికి కీడు కలుగుతుంది. దాంపత్య జీవితంలో వివాదాలు, కుటుంబంలో అశాంతి, బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే ప్రమాదం ఉందని పండితులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..