AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గణనాథుడి విగ్రహాలకు జీవం పోస్తున్న రాజస్థాన్ కళాకారులు.. ఇదే వాళ్ళ జీవనాధారం..

పార్వతిదేవి పసుపు ముద్ద చేసి వినాయకుడికి జీవం పోస్తే రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు తమ నైపుణ్యంతో అద్భుతమైన గణేష్ విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 18న జరిగే వినాయక చవితి వేడుకలకు ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి.గణపతి నవరాత్రుల్లో ఈ విగ్రహమే..

Andhra Pradesh: గణనాథుడి విగ్రహాలకు జీవం పోస్తున్న రాజస్థాన్ కళాకారులు.. ఇదే వాళ్ళ జీవనాధారం..
Ganesha Idols
Pvv Satyanarayana
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 11, 2023 | 4:48 PM

Share

రాజమండ్రి, సెప్టెంబర్ 4: పార్వతిదేవి పసుపు ముద్ద చేసి వినాయకుడికి జీవం పోస్తే రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారులు తమ నైపుణ్యంతో అద్భుతమైన గణేష్ విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు. ఈనెల 18న జరిగే వినాయక చవితి వేడుకలకు ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి.గణపతి నవరాత్రుల్లో ఈ విగ్రహమే అత్యంత కీలకమైంది. ఒకప్పుడు చిన్న చిన్న మట్టి విగ్రహాలతో ఏర్పాటు చేసే ఈ వేడుకలు ఇప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలతో సందడి చేస్తున్నాయి. దేవీ నవరాత్రులు, శ్రీరామనవమి వేడుకలు మాదిరిగా ఊరికే ఒక చోటో రెండు చోట్లో చవితి వేడుకలు జరగవు. వీధి వీధికి,సందు సందుకు గణనాధుడు కొలువు తీరాల్సిందే.

చిన్న పెద్ద అనే బేధం లేకుండా ఈ వేడుకల్లో పాలు పంచుకోవాల్సిందే. ఇక ఈ వేడుకలు ముగింపు సందర్భంగా గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు మామూలుగా ఉండడం లేదు. ఎవరికి వారు పోటాపోటీగా విగ్రహాలను ఊరేగించి నదులు, కాలువలలో నిమజ్జనం చేసే తీరు చూసి తీరాల్సిందే.ముఖ్యంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమగోదావరి జిల్లాలలో ఈ వేడుకలు తారాస్థాయిలో జరుగుతాయి. అందుకునే ఈ విగ్రహాలు తయారీ కూడా భారీ ఎత్తున చేపడుతుంటారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కళాకారులు వలస వచ్చి అయిదారు నెలలు ముందు నుంచే ఈ విగ్రహాలు తయారీలో నిమగ్నమై ఉంటారు. ముఖ్యంగా రాజమండ్రి, కాకినాడ,ధవలేశ్వరం, లాలాచెరువు ,రాజానగరం ప్రాంతాల్లో వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు రాజస్థానీ కార్మికులు…

విగ్రహాల తయారీ ఇలా….

బంక మట్టి, తెల్ల సున్నం, కొబ్బరి పీచు, కర్రలతో ఈ గణేష్ విగ్రహాలను తయారు చేస్తారు. వినాయక ఆకారాలు కలిగిన అచ్చులను కొనుగోలు చేసి తెల్ల సున్ను బంకమట్టి మిశ్రమాన్ని ఆ అచ్చులలో వేస్తారు. రెండు నుంచి మూడు రోజులు పాటు ఎండబెట్టి అనంతరం లోటుపాట్లను సరిదిద్దుతారు.పూర్తి స్థాయిలో విగ్రహం తయారయ్యాకా ఆకర్షనీయమైన రంగులు వేసి విక్రయానికి సిద్ధం చేస్తారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు గల విగ్రహాలను తయారు చేస్తున్నారు. సైజులను బట్టి వీటి ధర ఉంటుంది. కరోనా వల్ల మూడేళ్ల పాటు తీవ్రంగా నష్టపోయిన ఈ కళాకారులు ఈ ఏడాది పైనే ఆశలు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

గణేష్ ఉత్సవ కమిటీ వారు ముందుగానే ఈ విగ్రహాలను ఎంపిక చేసుకుని అడ్వాన్స్ ఇస్తారు. ఉత్సవాలకు ముందు రోజు వీటిని వాహనాల్లో తీసుకెళ్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, మండపేట తదితర పట్టణాల చివర్లలో వీటిని తయారు చేసే అమ్ముతుంటారు. అలాగే రావులపాలెం తుని,జగ్గంపేట తదితర ప్రదేశాలలో జాతీయ రహదారి పక్కన వీటి అమ్మకాలు జోరు అందుకుంటున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వేమగిరి వచ్చే దారిలో వివిధ రూపాలలో రూపుదిద్దుకున్న గణేష్ విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.తమ వద్ద వెయ్యి వినాయక విగ్రహాలులకు పైగా అందుబాటులో ఉన్నాయని రాజస్థాన్ నిర్వాహకులు చెప్తున్నారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.