Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. 4 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఇవాళ బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని..
Andhra Pradesh – Telangana Rain Alert: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఇవాళ బలపడి అల్పపీడనంగా మారనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లు జారీ చేసింది. 9 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావారణశాక. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇకపోతే ఏపీలోని కోస్తాంధ్రలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు కోస్తాంధ్ర, యానాంకు ఐఎండీ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. 11.5 సెం.మీ నుంచి 20.44 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. బలంగా గాలులు వీస్తాయని, భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.
హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ..
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 4, 2023
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 4, 2023
అమరావతి వాతావరణ శాఖ వాతావరణ నివేదిక..
5 Day weather warnings of Andhra Pradesh dated 04.09.2023 #IMD of#MCAmaravati #APforecast #APWeather pic.twitter.com/BitTd88VZt
— MC Amaravati (@AmaravatiMc) September 4, 2023
మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..