AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం కేసీఆర్‌ టీచర్స్‌ డే గిఫ్ట్.. 567 మంది గురుకుల కాంట్రాక్ట్‌ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు

ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ టీచర్స్‌ డే  సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ జీవో జారీ చేశారు. కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల జీతంతో పాటు 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో..

Telangana: సీఎం కేసీఆర్‌ టీచర్స్‌ డే గిఫ్ట్.. 567 మంది గురుకుల కాంట్రాక్ట్‌ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు
Telangana CM KCR
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Sep 04, 2023 | 9:39 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్ 4: ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ టీచర్స్‌ డే  సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ టీచర్లను క్రమబద్ధీకరిస్తూ జీవో జారీ చేశారు. కాంట్రాక్ట్ టీచర్లకు 12 నెలల జీతంతో పాటు 6 నెలల ప్రసూతి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానాన్ని పెంపొందించి.. లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదన్నారు.

గురుపూజోత్సవం వేళ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే బీసీ గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేసిన ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటు పీఆర్సీని అమలు చేస్తూ..12 నెలల పూర్తి వేతనాన్ని చెల్లిస్తోంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు తాజాగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కాంట్రాక్టు పద్ధతిలో ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 567 మంది ఉపాధ్యాయుల్లో వారిలో 504 మంది మహిళలే కావడం విశేషం. ఇక ప్రభుత్వం నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!