AIASL Recruitment 2023: పదో తరగతి అర్హతతో.. ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 998 ఉద్యోగాలు..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబాయిలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్).. 998 ఒప్పంద ప్రాతిపదికన 166 హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో హ్యాండీమ్యాన్ పోస్టులు 971, యుటిలిటీ ఏజెంట్ (పురుషులు 7, మహిళలు 20 ) పోస్టులు 27 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్‌లైన్ విధానంలో..
కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన ముంబాయిలోని ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఏఎస్‌ఎల్).. 998 ఒప్పంద ప్రాతిపదికన 166 హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో హ్యాండీమ్యాన్ పోస్టులు 971, యుటిలిటీ ఏజెంట్ (పురుషులు 7, మహిళలు 20 ) పోస్టులు 27 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 18, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి ఈ కింది అర్హతలు ఉండాలి.
హ్యాండీమ్యాన్ పోస్టులకు ఎస్‌ఎస్‌సీ లేదా 10వ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఎస్‌ఎస్‌సీ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన సర్టిఫికెట్ ఉండాలి. వయోపరిమితి తప్పనిసరిగా 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.
వయోపరిమితిలో రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు 28 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు 31 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్దులకు 33 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఆసక్తి కలిగిన వారు కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్, పర్సనల్ లేదా వర్చువల్ స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,330 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్..
HRD Department, AI Airport Services Limited, GSD Complex, Near Sahar Police Station, CSMI Airport, Terminal-2, Gate No. 5, Sahar, Andheri-East, Mumbai-400099.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.