Khammam: ట్రాన్స్‌జెండర్‌కు అరుదైన గౌరవం.. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈఎస్‌ఐ ఆసుపత్రిలో.. సత్కరించిన కలెక్టర్..
Khammam News: ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. ట్రాన్స్ జెండర్ కూడా ఉద్యోగ, ఉపాధి విద్య అవకాశాల్లో హక్కు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హైకోర్టు సీజే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూత్ జాన్పల్ మెడిసిన్ లో పీజీ విద్యకు అవకాశాన్ని కల్పించాలని ఆల్ ఇండియా, రాష్ట్ర స్థాయిలో ఆమె కోరుకున్న విభాగంలో ఎస్సీ ట్రాన్స్ జెండర్ కోటాలో సీటు కల్పించాలని..
ఖమ్మం జిల్లా, సెప్టెంబర్ 5: సమాజంలో ఎన్నో చీదరింపులకు, ఛీత్కారాలకు గురవుతున్న ట్రాన్స్ జెండర్లలో ఒకరికి అరుదైన గౌరవం దక్కింది. తాము కూడా అందరితో సమానమేనని చాటి చెప్పారు ట్రాన్స్ జెండర్ రూత్ జాన్పాల్ కొయ్యల. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రూత్ జాన్పాల్ తాజాగా పీజీలో సీటు సంపాదించారు. ఈ అవకాశం దక్కిన తొలి ట్రాన్స్ జెండర్ జాన్పాల్ కావడం విశేషం. ఖమ్మం కు చెందిన జాన్పాల్ 2018లో మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం చాలా ఆస్పత్రుల్లో యత్నించినా ట్రాన్స్ జెండర్ అన్న కారణంతో తిరస్కరించారు.
అయితే ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. ట్రాన్స్ జెండర్ కూడా ఉద్యోగ, ఉపాధి విద్య అవకాశాల్లో హక్కు కల్పించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా హైకోర్టు సీజే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూత్ జాన్పల్ మెడిసిన్ లో పీజీ విద్యకు అవకాశాన్ని కల్పించాలని ఆల్ ఇండియా, రాష్ట్ర స్థాయిలో ఆమె కోరుకున్న విభాగంలో ఎస్సీ ట్రాన్స్ జెండర్ కోటాలో సీటు కల్పించాలని పేర్కొన్నారు. కానీ ఫిమేల్ ఎస్సీ కేటగిరిలో తెలంగాణ ప్రభుత్వం పీజీ సీటును కేటాయించింది. ఈ ఎస్ ఐ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ఎండీ (డాక్టర్ ఆఫ్ మెడి సిన్) లో సీటు వచ్చింది.
కాగా, విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ రూత్ జాన్పాల్ ను ఘనంగా సత్కరించారు. పీజీ పూర్తయిన తర్వాత రూత్ జాన్పాల్ కు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..