Hyderabad Mutton Canteens: మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 12 నుంచి తెలంగాణలో మటన్ క్యాంటీన్లు..
Mutton Canteens soon: మటన్ బిర్యానీ , పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్ట్, ఖీమా వంటి మటన్ వంటకాలను అందించనున్నారు. ఈ మటన్ క్యాంటీన్‌లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడుతోంది. వీటిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మటన్ క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు అనుమతించడంతో పనులు మొదలు పెట్టారు.
మటన్ బిర్యానీ ప్రియులకు శుభవార్త. సురక్షితమైన, నాణ్యమైన మటన్‌తో కూడిన బిర్యానీలు , ఇతర నిజామీ రుచికరమైన వంటకాలు కూడా అందుబాటు ధరలో అందించేందుకు రెడీ అవుతోంది గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య. రాష్ట్ర ప్రభుత్వ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ క్యాటీన్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ సమీపంలో ఈ క్యాటిన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని శాంతినగర్‌లో ఈ నెల 12న ప్రారంభించనున్నారు. సరసమైన ధరలో నాణ్యమైన మటన్ బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలను దీని ద్వారా విక్రయిస్తారు.
ఇక్కడ లభించే వంటకాలు ఇవే..
మటన్ బిర్యానీ , పాయా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్ట్, ఖీమా వంటి మటన్ వంటకాలను అందించనున్నారు. ఈ మటన్ క్యాంటీన్‌లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయబడుతోంది. వీటిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. మెనూ, ధరలు ఇంకా ఖరారు కానప్పటికీ.. సరసమైన ధరలకు పరిమితమైన వంటకాలతో వీటిని రూపొందించనున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే మెనూని మరింత విస్తరింపజేస్తాం.
ఇప్పటికే ఫిష్ క్యాంటీన్..
శాంతినగర్‌లో ఇప్పటికే చేపల క్యాంటీన్ నడుస్తోంది. ఫిష్ భవన్ సమీపంలో ఈ క్యాంటీన్ ఉంది. ఇందులో ఫిష్ కర్రీతోపాటు ఫిష్ బిర్యానీ అందిస్తున్నారు. ఫిష్ క్యాంటీన్‌లో ఫిష్ బిర్యానీ, అన్నంతో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై మొదలైనవి ఉన్నాయి. వీరు అందించే వంటకాలకు మంచి పేరు కూడా వచ్చింది. వీటికి మంచి ఆదరణ లభించడంతో మటన్ క్యాంటీన్‌పై గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా..
హైదరాబాద్‌లోని మత్స్య భవన్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపల క్యాంటీన్‌ల తరహాలో మటన్ క్యాంటీన్‌లను రూపొందించారు. సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మటన్ క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు అనుమతించడంతో పనులు మొదలు పెట్టారు. సమాఖ్య కేంద్ర కార్యాలయం దగ్గరలోనే ఈ మటన్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్‌లో దీన్ని ప్రారంభించనున్నారు. ఆతర్వాత అన్నిజిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు ప్లాన్ చేస్తామని సమాఖ్య ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కీం ద్వారా గొర్రెల సంఖ్య పెద్దఎత్తున ముందుకు వెళ్తోంది. అయినా మటన్ ధరలు తగ్గక పోగా.. కొండెక్కి కూర్చున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సంచార క్యాంటీన్లనూ నిర్వహించాలని యోచిస్తున్నామన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం