Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సీఐ ఓవరాక్షన్.. డ్రైవర్లపై సీఐ బూతు పురాణం.. వీడియో.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ట్రావెల్స్ వాహనదారులపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన జీడిమెట్లలో కలకలం సృష్టిస్తోంది. రాత్రి వేళల్లో ట్రావెల్స్ బస్సులను ఆపి, డ్రైవర్లను కాలితో తన్నుతు,బూతులు తిడుతూ, కాలుతో తన్నుతూ.. ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు ఓ ట్రాఫిక్ సీఐ.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వాహనదారులపట్ల పలువురి ట్రాఫిక్ ఇన్‌స్పెకర్ట్‌ల తీరు వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా ట్రావెల్స్ వాహనదారులపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చేయిచేసుకున్న ఘటన జీడిమెట్లలో కలకలం సృష్టిస్తోంది. రాత్రి వేళల్లో ట్రావెల్స్ బస్సులను ఆపి, డ్రైవర్లను కాలితో తన్నుతు,బూతులు తిడుతూ, కాలుతో తన్నుతూ.. ఇష్ట మొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు ఓ ట్రాఫిక్ సీఐ. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బస్సు డ్రైవర్లను బండబూతులు తిట్టడమే కాకుండా.. విచక్షణా రహితంగా కాలుతో తన్ని, దాడి చేసిన సీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, వాహన దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన పోలీసులు.. వారి శాడిజాన్ని బస్సు డ్రైవర్ల పై ప్రదర్శిస్తున్నారని వాహనదారులు మండిపడుతున్నారు. తప్పు చేస్తే చలాన్ వేసి కేసులు పెట్టాల్సిన పోలీసులు.. డబ్బుల కోసం వారిని హింసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలిసులమని చెప్పుకునే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..