Srisailam Jalayasam: మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు అలెర్ట్.. శ్రీశైలం జలాశయం రహదారిపై వర్షాలకు విరిగిపడ్డ బండ రాళ్లు
వర్షం కురిసిన సమయంలో జలాశయం గేట్లు తెరిస్తే.. ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు కొండచరియలు నీళ్ల తుంపర్లకు రాళ్లు తడిచి విరిగిపడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి ప్రమాద కర ఘటనలు జరుగుతున్నా..అధికారులు ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లున్న ఉంటున్నారని అధికారుల తీరుపై వాహనదారుల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జలాశయాలు నీటికుండలా మారగా.. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి.. జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయం వద్ద రహదారిపై కొండచరియలనుంచి భారీ రాయి ఒకటి విరిగి రోడ్డుపై పడింది. అయితే అదే సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వర్షం కురిసిన సమయంలో జలాశయం గేట్లు తెరిస్తే.. ఇలాంటి ఘటన చోటు చేసుకుంటుందని అంటున్నారు. అంతేకాదు కొండచరియలు నీళ్ల తుంపర్లకు రాళ్లు తడిచి విరిగిపడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఇలాంటి ప్రమాద కర ఘటనలు జరుగుతున్నా..అధికారులు ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లున్న ఉంటున్నారని అధికారుల తీరుపై వాహనదారుల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందన కరువు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నుంచి శ్రీశైల క్షేత్రం వెళ్లే రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. రోజూ వందలాది మంది శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులు వాహనాలు రాకపోకలు జరిగే రహదారి ఇది. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై వాహన దారులు అధికారులపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే జలాశయం గేట్లు ఎత్తిన సమయంలో ఇలా రహదారిపై కొండ రాళ్ళు పడితే వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో ఇబ్బంది పడిన ఘటనలు చాలా వున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వాహనదారులు జలాశయ వీక్షకులు కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..