Love Marriage: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి.. వెంకన్న సన్నిధిలో పెళ్లి.. పట్టు వస్త్రాలతో సందడి చేసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు

తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు విదేశస్థులతో వివాహం చేసుకున్న ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది. ఈనెల 2 న ఈ ప్రేమ జంట వివాహం పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.  కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన వేమూరి సాయి దినకర్ తైవాన్ దేశంలో సించున్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడే సాయి దినకర్ కు ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న యుటింగ్ లీయు అనే యువతీతో పరిచయం ఏర్పడింది

Love Marriage: ఇక్కడ అబ్బాయి.. అక్కడ అమ్మాయి.. వెంకన్న సన్నిధిలో పెళ్లి.. పట్టు వస్త్రాలతో సందడి చేసిన యువతి తల్లిదండ్రులు, బంధువులు
Telugu guy Taiwan girl Marriage
Follow us
B Ravi Kumar

| Edited By: Surya Kala

Updated on: Sep 05, 2023 | 2:44 PM

దేశాలు వేరు.. భాషలు వేరు.. అయినా వారి మనసు ఒకటే.. ఇద్దరి మనుషులు కలిసి జీవించడానికి దేశాలు, భాషలు, ప్రాంతాలు, ఆచారాలు అడ్డుకావని మరోసారి ఓ ప్రేమ రుజువు చేసింది. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు విదేశస్థులతో వివాహం చేసుకున్న ఘటనలు అనేకం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కింది. ఈనెల 2 న ఈ ప్రేమ జంట వివాహం పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన వేమూరి కిషోర్ మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తారు. ఆయన కుమారుడు సాయి దినకర్ తైవాన్ దేశంలో సించున్ సిటీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అక్కడే సాయి దినకర్ కు ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న యుటింగ్ లీయు అనే యువతీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.  సాయి దినకర్, యూటింగ్ లీయు లు తమ ప్రేమని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. పెళ్ళి చేసుకోవడానికి ఒప్పించారు. దీంతో వీరి ప్రేమ పెళ్లిపీటలు ఎక్కింది. అంతేకాదు హిందూ సాంప్రదాయ పద్దతిలో పెళ్ళికి యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఏపీకి వచ్చి తమ కుమార్తె పెళ్లిని చేశారు.

ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. ఈనెల 2 న ద్వారకా తిరుమల దేవస్థానానికి చెందిన హరిని 2 కళ్యాణ మండపం వీరి  వివాహానికి వేదికయింది. వివాహ కార్యక్రమాన్ని పూర్తి హిందూ సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అందులో భాగంగా వధువు యుటింగ్ లియు ఆమె తల్లిదండ్రులు.. బంధువులతో సహా కార్యక్రమానికి హాజరయ్యారు. తైవాన్ దేశీయులు అందరూ హిందూ సాంప్రదాయ వస్త్రాలైన పట్టు వస్త్రాలు ధరించి వివాహ వేడుకలో పాల్గొన్నారు. విదేశీ మహిళలు సైతం పట్టు చీరలు కట్టి, మన కట్టు బొట్టుతో వివాహం జరిపించడంతో హిందూ సాంప్రదాయం పట్ల వారికి ఉన్న విశ్వాసం స్పష్టమైంది. అలాగే  పెళ్లికుమారుడి  స్వగ్రామంలో రిసెప్షన్ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు