Stray Dog: ఎమ్మిగనూరులో కుక్కలు స్వైర విహారం, చిన్నారి సహా ఇద్దరికి తీవ్ర గాయాలు.. అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆందోళన

వీధుల్లో సంచరించాలంటేనే భయం గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని కాలనీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలోని పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో పలువురు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Stray Dog: ఎమ్మిగనూరులో కుక్కలు స్వైర విహారం, చిన్నారి సహా ఇద్దరికి తీవ్ర గాయాలు.. అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆందోళన
Dog Attack In Kurnool
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 28, 2023 | 10:45 AM

వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధి కుక్కల బెడద ను నివారించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. వీధుల్లో సంచరించాలంటేనే భయం గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సి వస్తోందని కాలనీ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్ పరిధిలోని పలు చోట్ల వీధి కుక్కల దాడుల్లో పలువురు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు 18 వార్డులో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధిలో ఆడుకుంటున్న ఐదు సంవత్సరాల చిన్నారి సంగీత పై ఓ కుక్క విచక్షణారహితంగా దాడి చేసింది. ఆ చిన్నారి అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసే సరికి ఆ చిన్నారిని కింద పడేసి దాడి చేస్తుండగా, వెంటనే కుక్కను తరిమెందుకు ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ కుక్క కుటుంబ సభ్యులపై కూడా దాడి చేసింది. దీంతో చిన్నారితో పాటు మరో ఇద్దరి మహిళలకు కుడా గాయాలయ్యాయి. బాధితులను  చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీధిలో కుక్కలు చాలా సంచరిస్తున్నాయని వీటి నుండి తమను కాపాడాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ కుక్కల బెడదల నుండి తమను కాపాడాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..