Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: కొడుకు కాదు కొరివి వీడు.. వృద్ధురాలైన తల్లి చేతిలో రొట్టెముక్క పెట్టి.. నడి రోడ్డుపై వదిలేసి

ఆనందపురం మండలం, వేములవలస పూల మార్కెట్ సమీపంలో.. మృదురాలైన ఓ తల్లితో వచ్చాడు వ్యక్తి. అక్కడ తల్లిని వదిలి వెళ్ళిపోయాడు. మళ్లీ వస్తానని చెప్పి.. చేతిలో రొట్టె పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. అలా వెళ్ళిన ఆ వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. నిమిషాలు గంటలు గడుస్తున్నాయి.. కొడుకు కోసం ఆ తల్లి ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈలోగా తన ఒంట్లో ఉన్న సత్తువ నశించిపోతుంది. స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంత బాధలోనూ.. ఎవరిని పిలిచి సహాయం కోరలేదు ఆ వృద్ధురాలు.

Visakhapatnam: కొడుకు కాదు కొరివి వీడు.. వృద్ధురాలైన తల్లి చేతిలో రొట్టెముక్క పెట్టి.. నడి రోడ్డుపై వదిలేసి
Son Abandons Mother On The Road
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Surya Kala

Updated on: Aug 20, 2023 | 10:56 AM

మానవత్వం మంటగలిసింది.. నవ మాసాలు మోసి.. కని.. గారాబంగా పెంచి.. మమకారాన్ని చూపించి.. గోరుముద్దలు తినిపించి.. కడుపునిండా తిండి పెట్టి.. ఏడవగానే గుండెలు హత్తుకొని.. ఆలనా పాలన చూసి పెద్దవాడిని చేసిన ఆ తల్లికి ఓ కసాయి కొడుకు కనీసం కనికరం చూపించలేదు. వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లిని.. నడిరోడ్డుపై విడిచిపెట్టి వెళ్లిపోయాడు ఓ ప్రబుద్ధుడు. చేతిలో రొట్టె ముక్క పెట్టి ఇప్పుడే వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో నడిరోడ్డుపై వణుకుతు స్పృహ కోల్పోయే దశలో ఉన్న ఆ అవ్వను చూసి చలించిన స్థానికులు.. పోలీసుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా ఆనందపురం లో జరిగిన ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలచివేసింది.

మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కుటుంబ విలువలు దిగజారి పోతున్నాయి. డబ్బు, జల్సాలకు ఇచ్చే ప్రాధాన్యత రక్తాన్ని పంచి జన్మనిచ్చిన వాళ్లకు ఇవ్వడం లేదు. సాటి మనిషే కాదు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా దూరం చేసి కఠినంగా వ్యవహరించే వాళ్లు లేకపోలేదు. తాజాగా విశాఖ జిల్లా ఆనందపురం లో నడిరోడ్డుపై ఓ తల్లి పడుతున్న వేదన స్థానికులను కంటతడి పెట్టించింది.

నడిరోడ్డుపై నీరసించి..

ఆనందపురం మండలం, వేములవలస పూల మార్కెట్ సమీపంలో.. మృదురాలైన ఓ తల్లితో వచ్చాడు వ్యక్తి. అక్కడ తల్లిని వదిలి వెళ్ళిపోయాడు. మళ్లీ వస్తానని చెప్పి.. చేతిలో రొట్టె పెట్టి అక్కడి నుంచి జారుకున్నాడు. అలా వెళ్ళిన ఆ వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. నిమిషాలు గంటలు గడుస్తున్నాయి.. కొడుకు కోసం ఆ తల్లి ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఈలోగా తన ఒంట్లో ఉన్న సత్తువ నశించిపోతుంది. స్పృహ కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయింది. ఇంత బాధలోనూ.. ఎవరిని పిలిచి సహాయం కోరలేదు ఆ వృద్ధురాలు. పూల మార్కెట్ వద్ద ఆ వృద్ధురాలు చాలాసేపటి నుంచి ఉన్నచోటనే ఉండటం గమనించిన స్థానికులు.. ఆమె దగ్గరకు వెళ్లి వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. అయితే అంతటి బాధలోనూ తన కుటుంబం వివరాలు వదిలి వెళ్ళిన కొడుకు వివరాలు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. ఎందుకంటే ఒకవేళ కొడుకును పిలిచి తిడతారేమోనన్నా ఆవేదనతో తనకు కష్టం ఉన్న ఓర్చుకొని అలాగే ఉండిపోయింది.

ఆసుపత్రికి తరలింపు..

నీరసించిన ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆమెకు సత్వరమే సవరియాలు అవసరమని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకొని అక్కడకు చేరుకున్న ఎస్సై నరసింహమూర్తి, తన సిబ్బంది.. రోడ్డు పై దీన స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం పోలీసులు, వైద్య సిబ్బంది సహాయంతో కే జి హెచ్ కు తరలించారు.

కొడుకు తిరిగి వస్తాడని..

పోలీసులు ఆమెను మళ్లీ వివరాలు అడిగే ప్రయత్నం చేశారు. తమది అంబటి వలస గ్రామమని.. తన కొడుకు పేరు రాంబాబు అని మాత్రమే ఆమె చెప్పగలిగింది. కొడుకు తిరిగి వస్తాడని తెలియక.. తన కొడుకు ఇక్కడ ఉండమని వస్తానని చెప్పి వెళ్లాడని ఇంతవరకు రాలేదని ఆ వృద్ధురాలు చెబుతుంటే పోలీసులకు కళ్ళల్లో నీళ్లు తిరిగేంత పని అయింది. అయితే ఆమె వివరాలు ఎవరికైనా తెలిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు. నడిరోడ్డుపై ఇలా తల్లిని వదిలేసి వెళ్లిపోయిన కొడుకుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.

మాతృత్వాన్ని పంచి మమకారంతో పెంచి పెద్దవాడిని చేసిన పాపానికి.. వృద్ధాప్యంలో ఉన్న ఈ తల్లికి ఆ కొడుకు చేసిన సేవ. సమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటనతో స్థానికులను తీవ్ర ఆగ్రహాన్ని గురిచేసింది. వాడికి మనసు ఎలా వచ్చింది అంటూ ఆవేదన చెందరు స్థానికులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..