AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Killer Bees: విషపుటీగలు.. కుడితే రక్తం విరిగి మనిషి చనిపోవటమే.. సముద్రతీరంలో మళ్లీ టెన్షన్

సునామీ సృష్టించిన కల్లోలం నుండి తీర ప్రాంత ప్రజలు బయటపడినా ఇంకా ఈ విషపు ఈగలు వెంటాడుతూనే ఉన్నాయి. తీర ప్రాంతంలో చెట్లపై తిష్ట వేసి చెట్లు ఎక్కిన వారి పై దాడి చేసేవి. ప్రభుత్వ అధికారులు వీటిని నిర్మూలించేందుకు మంట పెట్టి చాలా వరకు చంపేశారు. అయితే ఇప్పుడు ఈ విషపుటీగలు తీర ప్రాంతం నుండి పట్టణానికి అనుకుని ఉన్న గ్రామాలకు విస్తరించాయి.

Killer Bees: విషపుటీగలు.. కుడితే రక్తం విరిగి మనిషి చనిపోవటమే.. సముద్రతీరంలో మళ్లీ టెన్షన్
South African Bees
B Ravi Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 22, 2023 | 1:19 PM

Share

విషపు ఈగలు ఇవి కాలనాగులు కంటే యమ డేంజర్ అచ్చం తేనెటీగలను పోలి ఉండే ఈ ఈగలు కుట్టాయంటే అంతే సంగతులు ప్రాణాలు గాల్లో కలసి పోవల్సిందే. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేసాయి. ఇపుడు అక్కడి ప్రజలను గజగజలాడిస్తున్నయి. సునామీ సృష్టించిన కల్లోలం నుండి తీర ప్రాంత ప్రజలు బయటపడినా ఇంకా ఈ విషపు ఈగలు వెంటాడుతూనే ఉన్నాయి. తీర ప్రాంతంలో చెట్లపై తిష్ట వేసి చెట్లు ఎక్కిన వారి పై దాడి చేసేవి. ప్రభుత్వ అధికారులు వీటిని నిర్మూలించేందుకు మంట పెట్టి చాలా వరకు చంపేశారు. అయితే ఇప్పుడు ఈ విషపుటీగలు తీర ప్రాంతం నుండి పట్టణానికి అనుకుని ఉన్న గ్రామాలకు విస్తరించాయి. వీటికి మనుషుల అలికిడి వినపడిందంటే దాడి చేస్తాయి.

గతంలో పేరుపాలెం గ్రామంలో ఈ విషపు తీగల బారినపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పెదమైన వానిలంక గ్రామంలో ఒకరు వీటి బారిన పడి మృత్యువుతో పోరాడి ఎలాగో ప్రాణం దక్కించుకున్నారు. తీరంలో అనేక మంది ఈ విషపు ఈగల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనేక పశువులు సైతం మృత్యువాత పడ్డాయి.

నరసాపురం మండలం రుస్తుంబాద పంచాయతీ లోని గాదె వారి తోట గ్రామంలో ఆకు కూరలు పండించే తోటకు ఏర్పాటు చేసిన సరిహద్దు చెట్లలో ఇవి ప్రస్తుతం గూడు ఏర్పాటు చేసుకున్నాయి. విషపు ఈగల భయంతో ఆ తోట వైపు వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఎప్పుడు ఆ విషపు ఈగలు తమపై దాడి చేస్తాయోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. తోటలో పనిచేయడానికి రైతులు వెళ్లకపోవడంతో తోటలకు నీరు లేక ఎండిపోతున్నాయి.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా నుంచి విషపు ఈగలు

ఈ విషపు ఈగలపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు ఇవి దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ఈగలుగా గుర్తించారు. ఇవి సునామీ కి సముద్రం మీదగా నరసాపురం తీర గ్రామాలకు వచ్చాయి. ఇవి కుట్టయంటే రక్తం విరిగిపోయి మనుషులు చనిపోతారు. విషపు టీగలను అరికట్టడానికి అప్పట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ రెస్క్యూ పేరుతో ఓఎన్జీసీ సహకారంతో ఈ విషపు టీగలను ఏక కాలంలో మంటలు పెట్టీ ధ్వంసం చేసారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గత మూడేళ్ళుగా వీటి జాడ కనిపించలేదు. అయితే ఇటీవల కాలంలో గ్రామాల్లో మళ్లీ ఈ విషపు టీగల గూళ్ళు దర్శనమిస్తుండడం తీర ప్రాంత గ్రామాల్లో అలజడి మొదలైంది. అధికారులు స్పందించి విషపు టీగలను వెంటనే అరికట్టాలని కోరుతున్నారు గ్రామస్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..