Drugs Found At Ratnagiri: వారం రోజులుగా సముద్రంలో చేపల్లా కొట్టుకొస్తున్న డ్రగ్స్ .. 250 కేజీలకు పైగా డ్రగ్స్‌ స్వాధీనం

భారత్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేగింది. కేజీ కాదు... రెండు కేజీలు కాదు... ఏకంగా 250 కేజీల డ్రగ్స్‌ తీరానికి కొట్టుకొచ్చాయ్‌!. ఇంతకీ, అదెక్కడో చూడండి. తీరానికి వస్తోన్న డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఇది జరుగుతోంది. ఆగస్ట్‌ 14న మొదలైన ఈ డ్రగ్స్‌ వరద.. ఇప్పటికీ కొనసాగుతోంది. కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా, దభోల్‌ క్రీక్‌ బీచ్‌లకు ఇవి కొట్టుకొస్తున్నాయి.

Drugs Found At Ratnagiri: వారం రోజులుగా సముద్రంలో చేపల్లా కొట్టుకొస్తున్న డ్రగ్స్ .. 250 కేజీలకు పైగా డ్రగ్స్‌ స్వాధీనం
Drugs Found At Ratnagiri
Follow us

|

Updated on: Aug 22, 2023 | 8:01 AM

ఒక్క రోజు కాదు, రెండ్రోజులు కాదు, వారం రోజులుగా డైలీ డ్రగ్స్‌ కొట్టుకొస్తూనే ఉన్నాయ్‌.. అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు.. అవును, వారం రోజులుగా మహారాష్ట్ర బీచ్‌ల్లోకి వందల కిలోల మాదక ద్రవ్యాలు కొట్టుకొస్తున్నాయ్‌!. తీరానికి వస్తోన్న డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఇది జరుగుతోంది. ఇప్పటివరకు 250 కేజీలకు పైగా మాదక ద్రవ్యాలు సముద్రంలో కొట్టుకొచ్చాయ్‌!. ఆగస్ట్‌ 14న మొదలైన ఈ డ్రగ్స్‌ వరద.. ఇప్పటికీ కొనసాగుతోంది. కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా, దభోల్‌ క్రీక్‌ బీచ్‌లకు ఇవి కొట్టుకొస్తున్నాయి. మొదట ఈనెల 14న కర్దే బీచ్‌లో 12 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బీచ్‌లో పది ప్యాకెట్ల డ్రగ్స్‌ దొరికాయి. ఆ తర్వాత వరుసగా మిగతా బీచ్‌ల్లోనూ డ్రగ్స్‌ పట్టుబడటం మొదలైంది. దభోల్‌ క్రీక్‌ బీచ్‌లో 12 కేజీల బరువున్న పది ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్‌ అధికారులు.

డ్రగ్స్‌ స్మగ్లర్లే వీటిని సముద్రంలో విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ వస్తున్నట్టు గుర్తించారు. విదేశీ నౌకల నుంచి ఇవి సముద్రంలో పడిపోయి ఉండాలి లేదా ఉద్దేశపూర్వకంగా స్మగ్లింగ్‌ కోసం పడేసి ఉంటారని భావిస్తున్నారు. స్థానికులిచ్చిన సమాచారంతోనే ఈ మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు అధికారులు. పెద్దఎత్తున డ్రగ్స్‌ పట్టుబడటంతో ఈ బీచ్‌ల్లో గస్తీ ముమ్మరం చేశారు.

అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారు అధికారులు. అంతేకాదు, తీర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు ఏమైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలంటూ స్థానికులను అలర్ట్ చేస్తున్నారు. అత్యంత ఖరీదైన మాదక ద్రవ్యాలు ఇలా సముద్రంలో కొట్టుకురావడం మాత్రం ఇదే ఫస్ట్‌టైమ్‌!. దీంతో  మహారాష్ట్ర బీచ్‌ల్లో కలకలం రేగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..