Ashwini Vaishnaw: పోస్టల్ ఉద్యోగితో ఫొటో దిగి ప్రశంసించిన బిల్ గేట్స్.. మోడీ విజన్‌తోనే సాధ్యమైందన్న అశ్విని వైష్ణవ్
Bill Gates praised Postmaster Kusuma: భారతదేశంలో డిజిటలైజషన్ ఒక సరికొత్త మార్పు.. అన్ని రంగాలను డిజిటలైజషన్ చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నడుంబిగించి ప్రపంచంలోనే అగ్రగ్రామిగా దూసుకెళ్తోంది. 2015 డిజిటల్ ఇండియా నినాదంతో ప్రధాని మోడీ.. అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. డిజిటలైజేషన్‌లో భాగంగా అన్ని రంగాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చి..

Bill Gates praised Postmaster Kusuma: భారతదేశంలో డిజిటలైజషన్ ఒక సరికొత్త మార్పు.. అన్ని రంగాలను డిజిటలైజషన్ చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నడుంబిగించి ప్రపంచంలోనే అగ్రగ్రామిగా దూసుకెళ్తోంది. 2015 డిజిటల్ ఇండియా నినాదంతో ప్రధాని మోడీ.. అన్నిరంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. డిజిటలైజేషన్‌లో భాగంగా అన్ని రంగాలను ఒకేతాటిపైకి తీసుకువచ్చి.. మరింత సులువుగా పనులు జరిగేలా.. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, వ్యాపార రంగాలను అనుసంధానం చేశారు. ఇప్పడు భారత బ్యాంకింగ్ వ్యవస్థ డిజిటలైజేషన్ లో అగ్రగ్రామిగా ఉందంటే.. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే.. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చారు. భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ రోజురోజుకు వేగంగా పుంజుకుంటోంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 70 మిలియన్ల మందికి నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు, చెల్లింపులు, యుటిలిటీ చెల్లింపులు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. దేశం తన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా ఉంది. కావున ప్రభుత్వ రంగం, వ్యాపారాలు దేశంలో ఎక్కడి నుంచైనా అందుబాటులో ఉండే సురక్షితమైన, తక్షణ పేపర్‌లెస్, నగదు రహిత సేవలను అందిస్తోంది. ప్రజలు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులువుగా యాక్సెస్ చేసేలా ప్రభుత్వం పలు చర్యలు కూడా తీసుకుంది. డిజిటలైజేషన్ తో అన్ని రంగాల సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా భారత్ పయనిస్తున్నందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం డిజిటలైజేషన్ కోసం తీసుకుంటున్న చర్యలకు ఉదాహరణగా.. ఇక్కడి పరిస్థితి ఉదహరణగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర పోస్ట్ ను పంచుకున్నారు. భారత పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ భారతీయ పోస్టల్ ఉద్యోగిని ప్రశంసించండంతోపాటు.. ఫోటోను పంచుకున్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బెంగళూరులోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ కుసుమ కెని ప్రశంసించారు. “భారత పర్యటనలో మార్పు కోసం నేను ఒక అద్భుతమైన శక్తిని కలుసుకున్నాను” అని గేట్స్ లింక్డ్‌ఇన్ సహా.. పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కుసుమ గురించి రాశారు. భారతదేశంలోని కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌లు స్మార్ట్‌ఫోన్ పరికరాలు, బయోమెట్రిక్‌లను ఉపయోగించడాన్ని ఆయన ప్రశంసించారు.




”నా భారత పర్యటనలో మార్పు కోసం నేను ఒక అద్భుతమైన శక్తిని కలుసుకున్నాను: కుసుమ, తన స్థానిక పోస్టల్ విభాగంలో అద్భుతాలు చేస్తున్న ఒక యువతి. సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. భారతదేశంలోని కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి స్మార్ట్‌ఫోన్ పరికరాలు, బయోమెట్రిక్‌లను ఉపయోగించడానికి కుసుమ వంటి బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌లను ప్రోత్సహిస్తోంది. ఆమె సమీకృత ఆర్థిక సేవలను అందించడమే కాదు; ఆమె సమాజానికి ఆశ, ఆర్థిక సాధికారతను అందిస్తోంది.” అంటూ బిల్ గేట్స్ పేర్కొన్నారు.
అశ్విని వైష్ణవ్ ట్విట్..
Realising PM @narendramodi Ji’s vision to leverage DPI for financial inclusion. pic.twitter.com/wjOacdedvr
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 21, 2023
కాగా.. బిల్ గేట్స్ పోస్ట్‌పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. బిల్ గేట్స్ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. ప్రధాని మోడీ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందంటూ పేర్కొన్నారు. ఆర్థిక సమ్మేళనం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రభావితం చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టి అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..