Minister Harish rao: నెల రోజుల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేయండి.. మంత్రి హరీష్ రావు కీలక సూచనలు
పంటరుణాల మాఫీపై ఆర్థికశాఖ మంత్రి పలు కీలకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును ఇతర బాకీల మీద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సూచనలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణ బకాయిలు ఉంటే మాఫీ సొమ్మును అన్ని ఖాతాల్లోకి సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సదరు రైతు అప్పటికే పంట రుణం చెల్లించి ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఇతర నేరుగా వారి చేతికే అందించాలని తెలిపారు.
పంటరుణాల మాఫీపై ఆర్థికశాఖ మంత్రి పలు కీలకు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును ఇతర బాకీల మీద జమ చేసుకోవద్దని బ్యాంకులకు సూచనలు చేశారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణ బకాయిలు ఉంటే మాఫీ సొమ్మును అన్ని ఖాతాల్లోకి సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ సదరు రైతు అప్పటికే పంట రుణం చెల్లించి ఉంటే ప్రభుత్వం విడుదల చేసిన సొమ్మును ఇతర నేరుగా వారి చేతికే అందించాలని తెలిపారు. అయితే కరోనా కారణంగా రాష్ట్రానికి రాబడి తగ్గినా కూడా రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే బ్యాంకులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. కొంచెం ఎక్కవగా శ్రమ తీసుకోనైనా నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన సోమవారం సమీక్ష చేశారు.
అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతులకు పంట రుణంతో పాటు ఉండొచ్చని.. అలాగే దాంతో పాటు వ్యక్తిగత, గృహ రుణాలు ఉండొచ్చని.. అయినా కూడా మాఫీ సొమ్మును పంటరుణం కిందే జమచేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి డబ్బు ఏదో ఒక రూపంలో తమకు చేరిందనే అభిప్రాయం రైతులకు రావాలని అన్నారు. పంట రుణాన్ని రెన్యవల్ చేసేసి మళ్లీ కొత్తగా రుణం ఇస్తే రైతులు ఎంతగానో సంతోషిస్తారని.. వారి జీవితాల్లో ఆనందం నింపేందుకు బ్యాంకర్లు సైతం చొరవ చూపాలని సూచించారు. అలాగే రుణమాఫీ ప్రక్రియను వేగంగా జరిగేలా సహకరించాలని కోరారు. అలాగే రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీ తీరును పరిశీలించడానికి టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే వారానికి ఒకసారి కమిటీ సమావేశమై ఏ బ్యాంకు నుంచి ఎంతమంది రైతులకు డబ్బులు వెళ్లాయో పరిశీలన చేస్తుందని హరీష్ రావు తెలిపారు. అయితే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీకి చాలావరకు పరిమితులను విధించాయని అన్నారు. కానీ రైతుల కోసం ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిగా రుణమాఫి అమలు చేసి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మొదటి దశలో 35 లక్షల మందికి రూ.16,144 కోట్ల రుణాలను మాఫీ చేశామని.. ఇక రెండో విడతలో దాదాపు 37 లక్షల మంది రైతులకు రూ.20,141 కోట్ల రుణ మాఫీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటిదాకా దాదాపు 16 లక్షల 66 వేల మంది రైతులకు రూ.8,097 కోట్లు మాఫీ జరిగిందని అన్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని నమ్ముకుంటే అభివృద్ధి ఉండదనే భావనను ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చివేశారని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం