Dwaraka Expressway: దేశంలోనే తొలి 8 లేన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే రెడీ.. ఇంజినీరింగ్‌ అద్భుతమంటూ నితిన్ గడ్కరీ ట్వీట్‌

ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ప్రయాణ అనుభూతిని ప్రజలు మరో వందేళ్లు గుర్తు ఉంచుకుంటారని అన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే గురించి ముఖ్య విషయాలు ఏమిటంటే..ఎక్స్‌ప్రెస్ వే వల్ల ద్వారక నుండి మనేసర్ మధ్య ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గుతుంది.అలాగే మానేసర్ నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య దూరం తగ్గి.. 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. మానేసర్ నుంచి సింఘు బోర్డర్‌ కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.

Dwaraka Expressway: దేశంలోనే తొలి 8 లేన్ల ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే రెడీ.. ఇంజినీరింగ్‌ అద్భుతమంటూ నితిన్ గడ్కరీ ట్వీట్‌
Dwarka Expressway
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2023 | 9:14 AM

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వీడియోను విడుదల చేశారు. ఢిల్లీలోని ద్వారక, గురుగ్రామ్‌లోని ఖేరీ దౌలా టోల్ ప్లాజాను కలుపుతూ 27.6 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇది ఇంజినీరింగ్‌ అద్భుతమని నితిన్ గడ్కరీ తెలిపారు. మరో మూడు నుంచి నాలుగు నెలల్లో ఈ రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ రహదారిపై ప్రయాణ అనుభూతిని ప్రజలు మరో వందేళ్లు గుర్తు ఉంచుకుంటారని అన్నారు.

ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే గురించి ముఖ్య విషయాలు ఏమిటంటే..

ఎక్స్‌ప్రెస్ వే వల్ల ద్వారక నుండి మనేసర్ మధ్య ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే మానేసర్ నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య దూరం తగ్గి.. 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.

మానేసర్ నుంచి సింఘు బోర్డర్‌ కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ఈ ద్వారక ఎక్స్‌ప్రెస్ నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీలు వాడారు.

ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించడానికి తీసుకున్న దానికంటే 30 రెట్లు ఎక్కువ స్టీల్‌తో పాటు, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి ఉపయోగించిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ సిమెంట్ కాంక్రీటుని ఉపయోగించారు.

ఇంకా 20 లక్షల క్యుబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ వాడారు.

నిర్మాణ సమయంలో తొలగించిన సుమారు 1,200 చెట్లను తిరిగి మరోచోటులో నాటారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని శివ మూర్తి వద్ద NH 48 (పాత NH 8) యొక్క 20-కిమీ మార్క్ వద్ద ప్రారంభమవుతుంది.

ఢిల్లీ-గుడ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలోని శివ్‌-మూర్తి వద్ద ప్రారంభమై ఢిల్లీ సెక్టార్‌ 21లోని ఖేర్కి దౌలా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది.

ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఇది జాతీయ రాజధాని..  గురుగ్రామ్ మధ్య ప్రత్యామ్నాయ రహదారి లింక్‌గా ప్రణాళిక చేయబడింది.

దేశంలోనే తొలి ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే. ఇందులో 3.6 కి.మీ పొడవు, ఎనిమిది లైన్ల అండర్‌ టన్నెల్‌ రోడ్డును నిర్మించారు. నాలుగు ప్యాక్ మోటార్‌వే మొత్తం పొడవు 563 కిలోమీటర్లు.

అంతేకాకుండా, దేశంలోని మొదటి 8-లేన్ 3.6 కి.మీ పొడవు గల ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌తోపాటు, అండర్‌పాస్‌ల యాక్సెస్‌ కోసం వేర్వేరు ఇంటర్‌ఛేంజ్‌లను ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే