AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓరి మీ భక్తి బంగారం కానూ..! నాగులపంచమి రోజున నాగుపామును ఇంటికి తీసుకొచ్చి ఏం చేశారంటే..

Snake Puja Viral Video: నిజశ్రావణమాసం ప్రారంభంతోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో ఆగస్టు 21న దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Aug 22, 2023 | 10:55 AM

Share

Snake Puja Viral Video: నిజశ్రావణమాసం ప్రారంభంతోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి కూడా కావడంతో ఆగస్టు 21న దేశంలోని పలు ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కోలాహలంగా నాగదేవత విగ్రహాలకు పూజలు చేశారు. పుట్టలో పాలు పోసి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పుట్ట దగ్గర పూజలు.. ఆ పుట్ట దగ్గర ఒకవేళ పాము ప్రత్యక్షంగా కనిపిస్తే నేరుగా దానికే పూజలు చేయడం మనం చూసి ఉంటాం. కానీ కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో నిజమైన పామును ఇంటికి తీసుకొచ్చి మరీ పూజలు చేసింది ఓ కుటుంబం. వివరాల్లోకి వెళితే.. సిరాసీలోని ప్రశాంత్ హులేకల్ అనే వ్యక్తికి పాములు అంటే చాలా ఇష్టమట. అందుకే ప్రతి ఏటా నాగుల పంచమి రోజు కుటుంబ సమేతంగా అత్యంత భక్తిశ్రద్ధలతో పాములకు పూజలు చేస్తారట. ఇందులో విశేషమేముంది అనుకోకండి.. పండుగ రోజున ఏకంగా ఓ పామును ఇంటికి తీసుకొచ్చి దానిని ఓ పళ్లెంలో ఉంచి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.

అయితే, ఎప్పటిలాగే ఈసారికూ నాగపంచమి సందర్భంగా ఓ పాము పిల్లకు పూజలు చేశారు. సమాజానికి పాములను సంరక్షించాలన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నాడు. గడిచిన 35 ఏళ్లుగా ఆయన సరీసృపాల సంరక్షణకు కృషి చేస్తున్నాడు. సర్పాల గురించి అవగాహన కల్పించేందుకే తాను ఇలా పూజలు చేస్తానని, పాముల పట్ల తనకు ప్రత్యేక భక్తి ఉందని చెబుతున్నాడు. నాగుల పంచమి రోజు అడవి నుంచి పామును పట్టుకొచ్చి పూజలు చేసి, ఆ తర్వాత దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని చెప్పాడు.

ప్రశాంత్ తండ్రి సురేశ్ సైతం పాముల సంరక్షణకు పాటుపడేవారు. సురేశ్ మరణం తర్వాత ఆయన కొడుకులు ప్రశాంత్, ప్రకాశ్, ప్రణవ్​లు.. పాముల సంరక్షణకు పాటుపడుతున్నారు. స్థానికంగా ఎక్కడైనా పాము కనిపించిందని ఫోన్ వచ్చిందంటే వీరు అక్కడికి వెళ్లిపోతారు. పామును జాగ్రత్తగా పట్టుకొని ఆ తర్వాత దాన్ని దగ్గర్లోని అడవిలో విడిచిపెడతారు. అటవీ శాఖ అధికారులు సైతం పాములను పట్టేందుకు ప్రశాంత్ సాయం తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!