Chandrayaan-3: చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండిగ్ ఈరోజే జరుగుతుందా ? లేక వాయిదా ?

చంద్రయాన్ - 3 ల్యాండర్ చంద్రునిపై దిగేందుకు కీలక ఘట్టం ఆసన్నమైంది. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు సైతం చంద్రయాన్ -3 పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రయోగాలు ఏం మార్పులు లేకుండా.. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారం సాంయత్రం సరిగ్గా 6.04 PM గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రని దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. ఇక సాయంత్రం 5.20 PM గంటల నుంచే ఈ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Chandrayaan-3: చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండిగ్ ఈరోజే జరుగుతుందా ? లేక వాయిదా ?
Vikram Lander
Follow us
Aravind B

|

Updated on: Aug 22, 2023 | 7:03 AM

చంద్రయాన్ – 3 ల్యాండర్ చంద్రునిపై దిగేందుకు కీలక ఘట్టం ఆసన్నమైంది. భారత్‌తో పాటు ప్రపంచదేశాలు సైతం చంద్రయాన్ -3 పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రయోగాలు ఏం మార్పులు లేకుండా.. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారం సాంయత్రం సరిగ్గా 6.04 PM గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రని దక్షిణ ధ్రువం ఉపరితలంపై కాలు మోపనుంది. ఇక సాయంత్రం 5.20 PM గంటల నుంచే ఈ ప్రయోగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ చంద్రయాన్ -3 కి ఎలాంటి భంగం లేకుండా ల్యాండర్ సెఫ్‌గా చంద్రునిపై దిగితే ఇది కేవలం భారతీయులకే కాదు..ప్రపంచానికి అదోక అద్భుతమైన రోజే. మరో ముఖ్య విషయం ఏంటంటే చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారిగా అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.

ఇప్పటికే చంద్రునిపై అమెరికా, చైనా, రష్యా దేశాలు విజయవంతంగా తమ ల్యాండర్‌ను దింపాయి. ఇప్పుడు ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సురక్షితంగా దిగిన నాలుగో దేశంగా రికార్టుకెక్కుంతుంది. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ ఇప్పటికే చంద్రయాన్ – 2 ఆర్బిటార్‌తో కమ్యూనికేషన్‌ను కూడా ఏర్పరుచుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం వెల్లడించారు. వెల్‌కమ్ బడ్డీ అంటూ ల్యాండర్ మాడ్యూల్‌కు ఆర్బిటాల్ వెల్‌కమ్ చెప్పిందని తెలిపారు. ఆర్బిటాల్‌తో అనుసంధానం వల్ల ల్యాండర్ మాడ్యూల్ గురించి ఇంకా ఎక్కువగా సమాచారం తెలుసుకునేందుకు వీలవుతోందని తెలిపారు. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యూల్ చక్కగా పనిచేస్తోందని.. ఇప్పుడైతే దానికి ఎలాంటి అవరోధాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఇక ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఢిల్లీలో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌తో భేటీ అయ్యారు. ప్రయోగానికి సంబంధించి అన్ని వ్యవస్థలూ బాగా పని చేస్తున్నాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ల్యాండర్‌ మాడ్యూల్‌ ప్రస్తుతం చంద్రునికి అత్యంత సమీపానికి చేరుకుంది. ఇక ల్యాండింగే తరువాయి. మాడ్యూల్‌ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు కసరత్తులు చేస్తున్నారు. ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు ల్యాండర్‌లో ఉన్న సైంటిఫిక్‌ పరికరాలతో చంద్రుడి ఉపరితలంపై పరిస్థితిని మళ్లీ ఒకసారి క్షుణ్నంగా సమీక్షిస్తామని ఇస్రో తెలిపింది. పరిస్థితి పూర్తి అనుకూలిస్తేనే ల్యాండ్‌ చేస్తామని తెలిపింది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ల్యాండింగ్‌ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయనున్నట్లు ఇస్రో అధికారిక వర్గాల నుంచి సమాచారం వచ్చింది. 2019లో చేపట్టిన చంద్రయాన్‌–2 ప్రయోగం విఫలం కావడం, అలాగే తాజాగా రష్యా లూనా–25 క్రాష్‌ ల్యాండింగ్‌ అయిన నేపథ్యంలో చంద్రయాన్‌–3 విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?