AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan-3: చంద్రయాన్‌-3 గురించి ఇస్త్రో కీలక అప్‌డేట్‌.. ల్యాండింగ్‌ తేదీ మారనుందా..?

ఇస్రో ప్రకారం.. చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇస్రో నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ తేదీ మారవచ్చు అని తెలుస్తోంది. ఈ మేరకు ఇస్రో సీనియర్ అధికారులు వెల్లడించారు. ఎందుకంటే చంద్రునిపై చంద్రయాన్‌ -3ని ల్యాండ్ చేయడానికి చదునైన ఉపరితలం కనుగొనడం చాలా కష్టంగా మారిందట..

Chandrayaan-3: చంద్రయాన్‌-3 గురించి ఇస్త్రో కీలక అప్‌డేట్‌.. ల్యాండింగ్‌ తేదీ మారనుందా..?
Chandrayaan 3
Subhash Goud
|

Updated on: Aug 21, 2023 | 9:44 PM

Share

చంద్రయాన్ 2 నుంచి చాలా పాఠాలు నేర్చుకుంటూ ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌ను చేపట్టింది. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండ్ అవుతుందని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే చంద్రయాన్ 3 చంద్రుని కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. కానీ ఇప్పుడు ఉపరితలంపై మృదువైన ల్యాండింగ్ వేచి ఉంది ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఈ ల్యాండింగ్ తేదీని ప్రకటించింది. ఇస్రో ప్రకారం.. చంద్రయాన్-3 ఆగస్టు 23, 2023న సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇస్రో నుంచి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ తేదీ మారవచ్చు అని తెలుస్తోంది. ఈ మేరకు ఇస్రో సీనియర్ అధికారులు వెల్లడించారు. ఎందుకంటే చంద్రునిపై చంద్రయాన్‌ -3ని ల్యాండ్ చేయడానికి చదునైన ఉపరితలం కనుగొనడం చాలా కష్టంగా మారిందట.

ల్యాండర్ మాడ్యూల్‌కు జోడించిన కెమెరా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేయబడ్డాయి. ఈ కెమెరా ద్వారా బంధించిన ఫోటోల ద్వారా ఇస్రో అధికారులు చదునైన ఉపరితలం కోసం చూస్తున్నారు. కానీ అలాంటి భాగమేదీ ఇంతవరకు గుర్తించబడలేదు. అందుకే చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవట్టవచ్చని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రయాన్-3 ల్యాండింగ్ తేదీ మారనుందా..?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ మేనేజర్ నీలేష్ మాట్లాడుతూ.. చంద్రయాన్‌-3 తేదీని మార్చుకోవచ్చని తెలిపారు. చంద్రయాన్‌ 3ని చంద్రుడిపై ల్యాండింగ్ చేయడానికి రెండు గంటల ముందు ల్యాండర్, చంద్రుని పరిస్థితిని సమీక్షిస్తామని ఆయన చెప్పారు. అక్కడి పరిస్థితులు అనుకూలిస్తే చంద్రుడిపై ల్యాండర్‌ను దింపేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోతే చంద్రునిపై ల్యాండర్ ల్యాండింగ్ తేదీని ఆగస్టు 27 వరకు పొడిగించవచ్చని ఆయన తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. అయితే ఆగస్టు 23న ల్యాండర్‌ను ల్యాండ్ చేయాలనేది ఇస్రో ఉద్దేశం. చివరి క్షణంలో పరిస్థితులను బట్టి తేదీ మార్పు జరిగే అవకాశం ఉంది.

లైవ్‌లో ల్యాండింగ్ దృశ్యాలు..

అయితే చంద్రయాన్‌ -3 ల్యాండింగ్‌కు సంబంధించి అద్భుతమైన దృశ్యాలను లైవ్‌ ద్వారా వీక్షించే అవకాశం ఉంది. దీని కోసం ఇస్రో ఏర్పాట్లు చేసింది. చంద్రునిపై ల్యాండింగ్‌ దృశ్యాలను వీక్షించేలా లైవ్‌ స్ట్రీమింగ్ చేయనుంది. 23వ తేదీ సాయంత్రం 5.27 నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు