AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 vs Luna 25: రష్యన్ లూనా 25 ప్రయోగం విఫలం.. అందరి చూపు భారత్ వైపే.. గమ్యం దిశగా చంద్రయాన్‌ 3..!

Chandrayaan 3 vs Luna 25: చంద్రుడి దక్షిణ ధ్రువంపై అందరికంటే ముందే అడుగుపెట్టి.. చరిత్ర సృష్టించాలనుకున్న రష్యా ఖగోళ శాస్త్రవేత్తల ఆశలు ఆదిలోనే గల్లంతయ్యాయి. చంద్రుడిపై లూనా 25 క్రాష్ ల్యాండింగ్‌తో.. మాస్కో అంచనాలు రెప్పపాటులో కుప్పకూలాయి. వందల కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రయాన్‌ 3 పొజిషన్‌ ఏంటి.. ఇస్రో రాకెట్ ఎంతవరకు సేఫ్‌.. ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అదెలా అంటే..

Chandrayaan 3 vs Luna 25: రష్యన్ లూనా 25 ప్రయోగం విఫలం.. అందరి చూపు భారత్ వైపే.. గమ్యం దిశగా చంద్రయాన్‌ 3..!
Luna 25; Chandrayaan 3
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 21, 2023 | 6:02 AM

Share

Chandrayaan 3 vs Luna 25: పరిగెత్తి పాలు తాగడం కంటే..నిలబడి నీళ్లు తాగడం మంచిదనే సామెతను ఇస్రో పాటించిందా.. రష్యా మూన్‌ మిషన్‌.. జెట్‌ స్పీడులో వెళ్లి చతికిల పడిందా.. ఇస్రో మూన్‌ మిషన్‌ పద్ధతిగా..ఒద్దికగా వెళ్తూ సరైన సమయానికి గమ్యం చేరుకుంటోందా.. ఇస్రో కూడా అదే చెబుతోందా..? చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టిన 27 రోజుల తర్వాత లూనా 25 ప్రయాణం మొదలైంది. మనకన్నా లేటుగా ప్రయోగం.. మనకన్నా రెండు రోజుల ముందే ల్యాండింగ్.. దీంతో లూనా 25పై రష్యా ఎంతో గర్వంగా ఫీల్ అయింది. అంతరిక్షంలో తమదే ఫస్ట్‌ రికార్డు అని జబ్బలు చరుచుకునేలోగా.. ఒక్కసారిగా ఆశలు ఆవిరయ్యాయి. .వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి.

చంద్రుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన లూనా 25.. ఒక్కరోజులో ల్యాండింగ్ కావాల్సి ఉంది. అంతా అనుకున్నట్టే జరుగుతుందని రష్యా ధీమాగా ఉంది. కానీ చివరి దశలో ప్రయోగం విఫలమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు.. హార్డ్‌ ల్యాండింగ్‌ అయ్యింది. మిషిన్‌ ప్రమాదానికి గురైంది. ప్రీ ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్లే టైమ్‌లో లూనాకు టెక్నికల్ ప్రాబ్లమ్‌ వచ్చింది. ఆటోమేటిక్ స్టేషన్‌లో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్‌ ఎదురైంది.. దీంతో.. లూనా 25 క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. జాబిలిపై ల్యాండ్ చేసే ముందు.. చందమామకు అత్యంత దగ్గరగా వెళ్లింది. కాని ప్రీ ల్యాండింగ్ కక్ష్యలోకి వెళ్లలేకపోవడంతోనే.. లూనా 25 జెర్నీ అర్ధాంతరంగా ముగిసిపోయింది. చంద్రయాన్‌ 3 కి.. లూనా 25కి చంద్రుడి కక్ష్యలో పోటీ ఏర్పడిందని ప్రపంచమంతా భావించింది. కానీ ఇది పోటీ కాదు మీటింగ్ స్పాట్ అంటూ ఇస్రో చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. మిత్ర దేశం రష్యా ప్రయోగం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించింది. రష్యా కూడా మన చంద్రయాన్ 3 విజయాన్ని ఆశించింది. చంద్రుడి కక్ష్యలో ఈ రెండింటి ప్రయాణం సాఫీగానే ఆరంభమైంది. ఓవైపు అన్ని కక్ష్యలను ఇస్రో విజయవంతంగా పూర్తి చేస్తూ ఇప్పుడు జాబిలి ముంగిట్లో ఇస్రో ఉంది. కానీ మాస్కో విఫలమైంది.

ఇవి కూడా చదవండి

టెక్నికల్‌గా మిషన్ ఫెయిల్ అయితే కావొచ్చు కానీ.. రష్యా శాస్త్రవేత్తల కృషి అభినందనీయం. ఎందుకంటే.. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ అంటే అంత ఈజీ కాదు. అందుకే ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ ప్రాంతాన్ని ఎంచుకోలేదు. మొదటి సారిగా ఇండియా గురిపెట్టింది. అయితే చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ కాలేకపోయింది. ఇప్పుడు లూనా 25 కూడా క్రాష్ ల్యాండింగ్ అయింది. అయితే చంద్రయాన్ 3 విషయంలో అలా జరిగే ప్రసక్తే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. చంద్రయాన్ 3 ల్యాండింగ్ గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మనం సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలిగితే.. ప్రపంచానికి మన సత్తా ఏంటో తెలియజేసినట్లవుతుంది..అంతే కాకుండా.. చంద్రుడిపై మున్ముందు చేయబోయే ప్రయోగాల్లో మనం కీలక పాత్ర పోషించేందుకు అవకాశం లభిస్తుంది.

Follow Us