Plane Crashes: నడిరోడ్డుపై కుప్పకూలిన విమానం.. సాంకేతిక లోపంతో ప్రమాదం..

Plane Crashes: నడిరోడ్డుపై కుప్పకూలిన విమానం.. సాంకేతిక లోపంతో ప్రమాదం..

Anil kumar poka

|

Updated on: Aug 21, 2023 | 7:44 AM

మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై విమానం కూలిపోవడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. లంగ్‌కావీ ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు.. ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం బయలుదేరింది. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా అనే విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది.

మలేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై విమానం కూలిపోవడం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. లంగ్‌కావీ ద్వీపం నుంచి ఆరుగురు ప్రయాణికులు.. ఇద్దరు పైలట్లతో ఓ చిన్న విమానం బయలుదేరింది. సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా అనే విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం గాల్లో అస్తవ్యస్తంగా తిరిగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాదారులు ఏం జరుగుతుందోనని చూస్తుండగానే విమానం నేలకూలి, పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకునన్ పోలీసులు హుటాహుటినా అక్కడికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో విమానంలోని 8 మంది మృతి చెందారు. అలాగే రోడ్డుపై ప్రయాణిస్తున్నవారిలో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుల్లో సెంట్రల్‌ పహాంగ్‌ రాష్ట్రానికి చెందిన చట్టసభ్యుడు జోహారీ హరున్‌ కూడా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం విమాన ప్రమాద దృశ్యాలు ఓ వాహనం డ్యాష్‌బోర్డు కెమెరాలో నమోదయ్యాయి. వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ విమానం ప్రమాదంపై మలేసియా ఎయిర్‌ఫోర్స్‌ మాజీ సభ్యుడు మహమ్మద్‌ శ్యామీ మహమ్మద్‌ హషీమ్ స్పందించారు. విమానం అస్థిరంగా ప్రయాణించడం తాను స్వయంగా చూశానని, ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని పేర్కొన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి చూడగా.. విమానం శకలాలు, ఓ మృతదేహం కాలుతూ కనిపించిందని వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదం ఇప్పుడు సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై నెటీజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘోరమైన ఘటనను ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...