Kurnool: దారి తప్పి పంట పొలాల్లోకి వచ్చిన జింక పిల్ల.. అటాక్ చేసిన కుక్కలు.. ఆ తర్వాత

Kurnool: దారి తప్పి పంట పొలాల్లోకి వచ్చిన జింక పిల్ల.. అటాక్ చేసిన కుక్కలు.. ఆ తర్వాత

J Y Nagi Reddy

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 21, 2023 | 7:41 AM

రోజుల వయస్సున్న జింక పిల్ల దారి తప్పి.. గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చింది. దీంతో ఊర కుక్కలు చెలరేగిపోయాయి. ఆ పసి జింకపై దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనను అటుగా వెళ్తున్న యువకుడు గమనించాడు. కుక్కలను చెదరగొట్టి.. ఆ జింక పిల్లను కాపాడాడు. పాపం ఆ బుల్లి జింక గాయాలతో బాధ పడుతుంటే దానికి చికిత్స చేయించాడు. అది కోలుకోవడంతో.. తిరిగి దాన్ని పోలీసులకు అప్పగించాడు. దీంతో అతడిని పలువురు అభినందించారు.

ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 21:  కర్నూలు జిల్లా గొనెగండ్ల మండలం, గంజిహళ్లి గ్రామ సమీప పొలాల్లో జింక పిల్ల లభ్యం అయ్యింది. పొలాల్లో చిన్న జింక పిల్లపై కుక్కలు దాడి చేస్తుండగా అటుగా వెళ్తున్న యువకుడు కొలిమి చంద్ బాషా గమనించి, వెంటనే పొలాల్లోకి వెళ్లి ఆ కుక్కల దాడి నుండి జింక పిల్లను రక్షించాడు. కుక్కుల దాడిలో చిన్న గాయాలు అయినా జింకకు చికిత్స చేయించి, గోనెగండ్ల ఎస్ఐ తిమ్మారెడ్డికు జింక పిల్లను చంద్ బాషా అప్పగించాడు. ఎస్ఐ ఎమ్మిగనూరు ఫారెస్ట్ అధికారులకు జింక పిల్లను అప్పగించగా, ఆ జింక పిల్ల పుట్టి వారం రోజులు అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జింక పిల్లను కాపాడిన చంద్ బాషను పలువురు అభినందించారు.