Chandrayaan-3: చంద్రయాన్‌ -3 జాబిల్లిపై అడుగుపెట్టే దృశ్యాన్ని లైవ్‌లో చూడాలనుకుంటున్నారా.?

Chandrayaan-3 Live Streaming: ఇదిలా ఉంటే నిజానికి ల్యాండర్‌ను సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయాలని తొలుత ఇస్రో భావించింది. అయితే ఈ సమయంలో స్వల్ప మార్పు చేశారు అధికారులు. 17 నిమిషాలు ఆలస్యంగా అంటే సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ చంద్రడిపై అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోన్న ల్యాండర్‌ అందుకోసం మంచి ప్రదేశాన్ని వెతికే పనిలో పడింది. ఎలాంటి క్రాష్‌ ల్యాండ్ అవ్వకూడదనే ఉద్దేశంతో రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో ల్యాండర్‌ను...

Chandrayaan-3: చంద్రయాన్‌ -3 జాబిల్లిపై అడుగుపెట్టే దృశ్యాన్ని లైవ్‌లో చూడాలనుకుంటున్నారా.?
ఇన్నాళ్లు అందని జాబిలి.. ఇప్పుడు గుప్పిట చిక్కింది. చంద్రుడి మీద ప్రయోగంలో సంపూర్ణ విజయం సాధించి మళ్లీ మీసం మెలేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద రోవర్‌ని దింపిన తొలి దేశంగా అవతరించింది భారత్‌.
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 22, 2023 | 5:41 PM

యావత్ భారతదేశం, ఆ మాటకొస్తే ప్రపంచమంతా 23వ తేదీ కోసం ఎదురుచూస్తోంది. జాబిల్లి రహాస్యాలను చేధించేందుకు ప్రయోగించిన చంద్రయాన్‌ 3 చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ అందరిలో ఆసక్తి మరింత పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్‌-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్‌ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్‌ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.

ఇదిలా ఉంటే నిజానికి ల్యాండర్‌ను సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయాలని తొలుత ఇస్రో భావించింది. అయితే ఈ సమయంలో స్వల్ప మార్పు చేశారు అధికారులు. 17 నిమిషాలు ఆలస్యంగా అంటే సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ చంద్రడిపై అడుగుపెట్టనుంది. చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోన్న ల్యాండర్‌ అందుకోసం మంచి ప్రదేశాన్ని వెతికే పనిలో పడింది. ఎలాంటి క్రాష్‌ ల్యాండ్ అవ్వకూడదనే ఉద్దేశంతో రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో ల్యాండర్‌ను దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే చంద్రయాన్‌-3 మానవాళి ఎప్పుడూ చూడని చంద్రుడి దక్షిణ దృవం ఫొటోలను భూమిపైకి పంపించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

చంద్రయాన్ 3 పంపించిన ఫొటోలు..

లైవ్‌లో ఇలా వీక్షించవచ్చు..

భారత అంతరిక్ష చరిత్రలో ఆవిష్కృతం కానున్న ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించాలనే కోరిక ప్రతీ ఒక్కరిలో ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకోసమే ఇస్రో చర్యలు చేపట్టింది. జాబిల్లిపై ల్యాండర్‌ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని ప్రజలంతా వీక్షించేలా లైవ్‌ స్ట్రీమింగ్ చేయనుంది. 23వ తేదీ సాయంత్రం 5.27 నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఇస్రో వెబ్‌సైట్‌, య్యూట్యూబ్‌ చానల్‌, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ చానల్‌లో ఈ దృశ్యాలను లైవ్‌లో చూడొచ్చు. అన్ని విద్యా సంస్థల్లో లైవ్‌స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేయాలని ఇస్రో పిలుపునిచ్చింది.

చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్ ఇక్కడ చూడొచ్చు..

టీవీ9లో ప్రత్యేకంగా..

భారతదేశ ఖ్యాతిని పెంపొందిచడమే ధ్యేయంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని టీవీ9 తెలుగు ప్రత్యేక కవరేజ్ ఇవ్వనుంది. 23వ తేదీ ఉదయం నుంచి చంద్రయాన్ 3కి సంబంధించి ప్రత్యేక కథనాలు టెలికాస్ట్ చేయనుంది. ప్రయోగానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ ను టీవీ9 తెలుగులో ఎప్పటికప్పుడు లైవ్ కవరేజ్ చూసేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..