AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shravana Tuesday: నేడు శ్రావణ మంగళవారం.. అమ్మాయిలు గౌరమ్మని ఇలా పూజిస్తే మంచి భర్త లభిస్తాడట.. పూజ విధానం మీకోసం..

మంగళ గౌరీ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, కుటుంబంలోని సుఖ, సంతోషం, శాంతి, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారని హిందూ మతంలో నమ్ముతారు. అంతేకాదు పెళ్లి కాని అమ్మాయిలు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడి లభిస్తాడు. అంతేకాదు వీరి వివాహానికి వచ్చే అడ్డంకులు అన్నీ సులభంగా తొలగిపోతాయి.

Shravana Tuesday: నేడు శ్రావణ మంగళవారం.. అమ్మాయిలు గౌరమ్మని ఇలా పూజిస్తే మంచి భర్త లభిస్తాడట.. పూజ విధానం మీకోసం..
Mangla Gauri Vratam
Surya Kala
|

Updated on: Aug 22, 2023 | 7:47 AM

Share

శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారంకు ప్రత్యేక ఉంది. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అంటే ఆగస్టు 22, 2023 నిజ శ్రావణ మాస  మంగళవారం. ఈ రోజున వివాహిత స్త్రీలు ఉపవాసం ఉండి నియమ నిబంధనల ప్రకారం మంగళ గౌరీని పూజిస్తారని మత విశ్వాసం. ఈ సమయంలో వివాహిత స్త్రీలు మాత్రమే కాదు.. మంగళ గౌరి దేవిని పెళ్లి కాని  అమ్మాయిలు కూడా మంచి వరుడు కావాలని.. త్వరలో వివాహం జరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజు మంగళ గౌరీ వ్రతం పూజా విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అఖండ సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో వివాహిత స్త్రీలు శ్రావణ మాసంలో నియమ, నిబంధనల ప్రకారం మంగళ గౌరీదేవిని పూజించడమే కాదు.. ఉపవాసాన్ని పాటిస్తారు. మంగళగౌరీ వ్రతాన్ని పద్దతిగా పూజించడం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుందని.. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని విశ్వాసం.

మంగళ గౌరీ వ్రతానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే?

మంగళ గౌరీ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, కుటుంబంలోని సుఖ, సంతోషం, శాంతి, శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారని హిందూ మతంలో నమ్ముతారు. అంతేకాదు పెళ్లి కాని అమ్మాయిలు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తే అమ్మవారి అనుగ్రహంతో మంచి వరుడి లభిస్తాడు. అంతేకాదు వీరి వివాహానికి వచ్చే అడ్డంకులు అన్నీ సులభంగా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మంగళ గౌరీని ఎలా పూజించాలంటే

మంగళగౌరీ వ్రతం చేయలనుకునే వివాహిత స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేస్తారు. తర్వాత అందరూ కలిసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజకు సిద్ధమవుతారు.

దీని తరువాత ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి.. పార్వతి విగ్రహాన్ని ప్రతిష్టించండి.

వివాహిత స్త్రీలు మంగళ గౌరీ వ్రతం ప్రారంభానికి ముందుగా పిండితో చేసిన దీపాన్ని నెయ్యితో వెలిగించాలి. ఆ తర్వాత అమ్మవారికి పండ్లు, పుష్పాలు సమర్పించి పూజించాలి.

పూజలో పసుపు, కుంకుమ, గాజులు వంటి వస్తువులు, పండ్లు, పువ్వులు, దండలు, స్వీట్లు వంటి వస్తువులను సమర్పించాలి. అయితే అమ్మవారికి సమర్పించే 16 కంటే తక్కువ ఉండకూడదని గుర్తుంచుకోండి.

వ్రత కథ చదువుకుని ముగింపు సమయంలో.. గౌరవమ్మవారికి హారతి ఇవ్వండి. తమకు సుఖ సంపదలతో పాటు అఖండ సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించండి.

అంతరం ముత్తైదువులకు పసుపు, కుంకుమ లతో పాటు తాంబూలం వాయనంగా ఇవ్వండి. వారి ఆశీర్వాదం తీసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)