AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology Tips: మహిళలు తలంటు స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి.. ఏ రోజు శుభకరం అంటే..

హిందూ మతంలో వారంలో కొన్ని రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధం.. అదే విధంగా మహిళలు వారంలోని కొన్ని రోజుల్లో, నెలలోని కొన్ని తేదీల్లో కూడా తలంటు స్నానం చేయడం నిషేధించబడింది. తలకు స్నానం చేయడానికి ఈ నియమాల వెనుక మత పరమైన కారణాలు మాత్రమే కాకుండా జ్యోతిషశాస్త్ర కారణాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణపతి పూజకు అంకితమైన సోమవారాలు, గణేశ పూజకు అంకితమైన బుధవారం, లక్ష్మీనారాయణుని ఆరాధనకు అంకితమైన గురువారాల్లో మహిళలు తలంటుకోరాదు.

Astrology Tips: మహిళలు తలంటు స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి.. ఏ రోజు శుభకరం అంటే..
Astrology Tips Related To Hair
Surya Kala
|

Updated on: Aug 19, 2023 | 9:25 AM

Share

హిందూమతంలో రోజువారీ జీవితంలో చేసే అన్ని రకాల పనులకు మతపరమైన నియమాలు ఉన్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు.. నిద్ర పోయే వరకూ చేసే పనుల్లో అనేక నియమాలు పేర్కొన్నారు. వీటిని అనుసరించిన వారి జీవితంలో సుఖ సంతోషాలు నిండి ఉంటాయి. అయితే ఈ నియమాలను కొందరు మూఢ నమ్మకాలుగా భావిస్తారు. అయితే వీటి వెనుక శాస్త్రీయ కోణం కూడా ఉందని కొందరు చెబుతారు. మహిళలను ఇంటికి మహాలక్ష్మిగా భావిస్తారు హిందూ సనాతన ధర్మంలోఈ నేపథ్యంలో.. ఇంటి ఇల్లాలు కూడా కొన్ని నియమాలను పాటించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆలాంటి నియమాల్లో ఒకటి స్త్రీలు తలకు స్నానం చేసే విషయం. అయితే ఏ రోజు తలకు స్నానం చేయాలి.. అనే విషయంలో గందరగోళం ఎదురవుతుంది.  స్త్రీలు తలకు ఏ రోజు స్నానం చేయాలి.. అనుకూలమైన, అశుభకరమైన రోజుల గురించి తెలుసుకుందాం..

ఏ రోజున తలకు స్నానం చేయాలంటే..

హిందూ మతంలో వారంలో కొన్ని రోజుల్లో జుట్టు, గోర్లు కత్తిరించడం నిషేధం.. అదే విధంగా మహిళలు వారంలోని కొన్ని రోజుల్లో, నెలలోని కొన్ని తేదీల్లో కూడా తలంటు స్నానం చేయడం నిషేధించబడింది. తలకు స్నానం చేయడానికి ఈ నియమాల వెనుక మత పరమైన కారణాలు మాత్రమే కాకుండా జ్యోతిషశాస్త్ర కారణాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గణపతి పూజకు అంకితమైన సోమవారాలు, గణేశ పూజకు అంకితమైన బుధవారం, లక్ష్మీనారాయణుని ఆరాధనకు అంకితమైన గురువారాల్లో మహిళలు తలంటుకోరాదు. హిందూ విశ్వాసం ప్రకారం ఈ మూడు రోజుల్లో తలంటు కోవడం మహిళలకు దురదృష్టాన్ని తెస్తుంది.

రుతుక్రమం తర్వాత ఎప్పుడు తలకు స్నానం చేయాలంటే..

హిందూ విశ్వాసం ప్రకారం ఒక మహిళ ఋతుక్రమం మూడు రోజుల తర్వాత ముగిస్తే.. నాల్గవ రోజున తలకు స్నానం చేయాలి. లేదా ఐదవ లేదా ఆరవ రోజున ముగిస్తే.. ఆమె ఎనిమిదవ రోజున తలకు స్నానం చేయాలి. అయితే ఏ కారణంతో నైనా స్త్రీ తల అంటుకోవాల్సి వస్తే.. తల స్నానము చేసే నీటిలో ఒక టీస్పూన్ రాక్ సాల్ట్ వేసి.. అప్పుడు తలకు స్నానం చేయాలి.

ఇవి కూడా చదవండి

ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటే..

హిందువుల విశ్వాసం ప్రకారం ఆడవారు హెయిర్ కటింగ్‌కు సంబంధించిన కొన్ని నియమాలున్నాయి. ఈ నియమాలను పాటించని స్త్రీ భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సోమవారం తలంటు స్నానం చేసే స్త్రీ.. కుమార్తె, కోడలు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మకం. అయితే బుధవారం తలంటుకుంటే ఆ స్త్రీ సోదరుడి జీవితంలో సమస్యలను తెస్తుంది. మరోవైపు గురువారం తలంటుకుంటే సుఖ సంతోషాలు దూరం అవుతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)