AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వన్యమృగాల టెర్రర్‌తో టీటీడీ అలెర్ట్.. శ్రీశైలం నుంచి తిరుమలకు స్పెషల్ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌

తిరుమల ప్రాంతంలో వారం రోజుల గ్యాప్‌లో రెండు చిరుతల్ని చెరబట్టేశాం.. బేఫికర్ మేమున్నాం అంటూ టీటీడీ భరోసానిస్తోంది. ఐనా అక్కడ టైగర్ ఫియర్ మాత్రం తగ్గనే లేదు. అందుకే.. వాట్‌ నెక్ట్స్ అంటూ ఆపరేషన్ రక్షక్ పేరుతో కొత్త కసరత్తు మొదలుపెట్టింది అటవీశాఖ. అడవుల్లోంచి బైటికొచ్చి జనానికి టెర్రర్‌ పుట్టిస్తున్నాయి వన్యమృగాలు.

Tirumala: వన్యమృగాల టెర్రర్‌తో టీటీడీ అలెర్ట్.. శ్రీశైలం నుంచి తిరుమలకు స్పెషల్ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌
Leopard In Tirumala
Surya Kala
|

Updated on: Aug 19, 2023 | 7:45 AM

Share

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి శేషాచలం అడవుల్లో తిరుమల గిరులపై కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. వేంకటాచల నాథా అంటూ భక్తులు శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి చేరుకుంటారు. అయితే గత కొంతకాలంగా తిరుమల ప్రాంతంలో అడవి జంతువులు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల ప్రాంతంలో వారం రోజుల గ్యాప్‌లో రెండు చిరుతల్ని చెరబట్టేశాం.. బేఫికర్ మేమున్నాం అంటూ టీటీడీ భరోసానిస్తోంది. ఐనా అక్కడ టైగర్ ఫియర్ మాత్రం తగ్గనే లేదు. అందుకే.. వాట్‌ నెక్ట్స్ అంటూ ఆపరేషన్ రక్షక్ పేరుతో కొత్త కసరత్తు మొదలుపెట్టింది అటవీశాఖ.

అడవుల్లోంచి బైటికొచ్చి జనానికి టెర్రర్‌ పుట్టిస్తున్నాయి వన్యమృగాలు. ఓ వైపు శేషాచలం అడవుల్లోంచి అలిపిరి నడక మార్గంలో సంచరిస్తున్న చిరుతలు భక్తజనాన్ని బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. మరోవైపు  ఎలుగుబంట్ల సంచారంపై కూడా ఎలర్ట్ అయింది టీటీడీ. అటవీశాఖతో కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతోంది.

మూడు ప్రాంతాలు- 30 బోన్లు.. 320 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనుంది. అంతేకాదు వీటికి అదనంగా.. శ్రీశైలం నుంచి తిరుమలకు స్పెషల్ ఎక్స్‌పర్ట్స్‌ టీమ్‌ తిరుమలకు రానుంది. చిరుతల్ని వనం నుంచి జనం వైపు రాకుండా దారిమళ్లించడమే ఈ స్పెషల్ ఎక్స్ పర్ట్స్ పని.

ఇవి కూడా చదవండి

గోవిందా గోవిందా అంటూ స్వామివారిని అలిపిరి, శ్రీ వారి మెట్లు మీదుగా కాలినడకన కొండపైకి చేరుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చిరుత భయంతో కాలినడక మార్గంలో భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. గత రెండు రోజుల్లో 8 వేల మంది భక్తులు మాత్రమే నడిచొచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా వచ్చే భక్తులతో పోలిస్తే ఇది మూడో వంతు మాత్రమే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..