- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips eating food in this direction person becomes addicted money misfortune not leave him in telugu
Vastu Tips: ఆహారం తీసుకోవడంలోనూ వాస్తు నియమాలు.. ఈ దిశలో ఆహరం తింటే అన్నీ కష్టాలే..
వాస్తు శాస్త్రంలో దిశలు చాలా ముఖ్యమైనవి. ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులతో పాటు.. నిర్మాణం విషయంలో కూడా వాస్తు నియమాలు పాటిస్తారు. ఎందుకంటే.. సరైన విషయాలను సరైన దిశలో ఉంచడం, సరైన దిశలో పనిచేయడం ద్వారా సానుకూల శక్తి ప్రసారం చేయబడుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలకు కారణం వాస్తు శాస్త్రంలో సరైన దిశలో ఆహారం అని కూడా చెప్పబడింది. మరోవైపు తప్పు దిశలో ఆహారం తీసుకోవడం వల్ల వాస్తు దోషాలు తలెత్తుతాయి. ఇంట్లో దుఃఖం, బాధ మరియు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.
Updated on: Aug 19, 2023 | 8:37 AM

వాస్తు శాస్త్రంలో తినడం, తాగేందుకు కూడా సరైన దిశను పేర్కొనబడింది. ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఆహారం తీసుకునేటప్పుడు కొన్ని వాస్తు నియమాలు పాటించాలి అనేది చాలా ముఖ్యం. ఇది చేయకపోతే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఆహారం తినడానికి ఉత్తమమైన దిశను ఉత్తరం, తూర్పుగా పరిగణిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిక్కును ఆహారం తీసుకోవడానికి అత్యంత అశుభకరమైనదిగా భావిస్తారు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్షు తగ్గిపోయి దురదృష్టాన్ని ఆహ్వానిస్తుంది.

ఆహారం తినడానికి పశ్చిమ దిశ కూడా సరైనది కాదు. ఈ దిశలో ఆహారం తీసుకోవడం ద్వారా.. ఆ వ్యక్తి అప్పుల పాలవుతాడు. Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)




