- Telugu News Photo Gallery Spiritual photos Naga Panchami: Lord Shiva wore a snake around his neck? what is the reasons
Sravana Masam: కాల సర్ప, రాహు కేతు దోషంతో ఇబ్బంది పడుతున్నారా.. నాగపంచమి రోజున ఇలా చేసి చూడండి.. శివయ్య అనుగ్రహం మీ సొంతం..
హిందూ సనాతన ధర్మంలో ప్రకృతిని పూజిస్తారు.. పాములు, పక్షులు, జంతువుల నుంచి ప్రతి జీవిలోనూ దైవాన్ని చూస్తారు. దైవంగా భావించి పూజిస్తారు. అలాంటి జీవుల్లో ఒకటి పాములు. ఈ పాములను హిందువులు దైవంగా భావించి పూజిస్తారు. శివుని మెడలో నాగరాజు అనే వాసుకి అనే పాము ఉంటుంది. ఇలా శివయ్య మేడలో ఆభరణంగా వాసుకి అలంకరణ వెనుక ఒక పురాణ కథ ఉంది.
Updated on: Aug 19, 2023 | 12:34 PM

హిందూ పురాణాల విశ్వాసాల ప్రకారం శివుని విగ్రహం సరళంగా ఉంటుంది. అయితే ఆలయంలో శివయ్య లింగాకారంలో పూజలను అందుకుంటాడు. తలపై నెలవంక, మెడలో రుద్రాక్షమాల, పాము, చేతిలో ఢమరుకం, త్రిశూలం.. శరీరానికి పులి చర్మం ధరించి ఉంటాడు. మహాదేవుడు తన భక్తుడైనా సర్పరాజుని ఆభరణంగా ధరించాడు. అయితే ఆ పాము శివయ్య కంఠాభరణంగా మారడం వెనుక ఉన్న కథ తెలుసుకుందాం..

మహాదేవుడితో పాటు నాగదేవత కూడా పూజలను అందుకుంటాడు. శివుడు వాసుకి పామును మెడలో నాగాభరణంగా ధరించాడు. అంతేకాదు శివలింగం ఎప్పుడూ ఒంటరిగా ప్రతిష్టించబడదు.శివలింగంతో పాటు నాగరాజు కూడా తప్పనిసరిగా శివలింగానికి ఆభరణంగా ఉండాలి.

నాగపాముని, నందిని పూజింనప్పుడు మాత్రమే శివుని ఆరాధన సంపూర్ణమైనట్లు పరిగణించబడుతుంది. నాగపంచమి రోజున నాగదేవత, శివుని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, సకల శుభాలు కలుగుతాయి. ఈ సంవత్సరం నాగ పంచమి ఆగస్టు 21, సోమవారం జరుపుకుంటారు. కాలసర్ప దోష నివారణకు కూడా ఈ రోజు ప్రత్యేకం. అంతేకాకుండా రాహు-కేతు దోషాలు తొలగిపోతే నాగపంచమి రోజున పరిహారాన్ని పాటిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి.

పురాణాల ప్రకారం పాముల్లో 8 ప్రధాన జాతులున్నాయి. నాగవంశీయులు హిమాలయాల్లో నివసించారని చెబుతారు. శివుడు కూడా అక్కడే ఉంటాడు. మహాదేవుడికి పాములంటే అమితమైన ప్రేమ, కరుణ. అందుకే నాగేశ్వర జ్యోతిర్లింగం చాలా ముఖ్యమైనది. శాస్త్రాల ప్రకారం శివునితో పాము అనుబంధం పురాతనమైనది. విడదీయరానిది.

శివుని మెడ చుట్టూ ఉన్న ఎనిమిది పాములు అతీంద్రియ శక్తులైన ఎనిమిది సిద్ధులను సూచిస్తాయి. మరోవైపు వాసుకి భోళాశంకరుడికి గొప్ప భక్తుడు. నిత్యం శివుడిని పూజించేవాడు. వాసుకి అపారమైన భక్తిని చూసి ముగ్ధుడైన శివయ్య వాసుకికి వరం ఇచ్చాడు. నాగాభరణుడయ్యాడు.

సముద్ర మథనం సమయంలో మేరు పర్వతాన్ని కవ్వంగా మలచి.. వాసుకి పామును తాడు రూపంలో చుట్టి . చిలకడం ప్రారంభించారు. దీంతో వాసుకి శరీరమంతా రక్తంతో నిండిపోయింది. ఈ సమయంలో సముద్ర నుంచి హాలాహలం పుట్టింది. శివుడు ఈ హాలాహలాన్ని తీసుకున్న్నాడు. అప్పుడు శివునికి సహాయం చేయడానికి వాసుకి కూడా కొంత విషాన్ని తీసుకున్నాడు.

ఈ విషాన్ని తాగడం వల్ల సర్పంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. వాసుకి భక్తిని చూసి శివుడు సంతృప్తి చెంది ఆ సమయంలో వాసుకి దగ్గరకు తీసుకుని అలంకారంగా చేసుకున్నాడు.





























