AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simhachalam Appanna Temple: అప్పన్న ఆలయంలో స్వర్ణ కాంతుల ధ్వజ స్తంభం.. బంగారు తాపడం పనుల ప్రారంభం

విశాఖనగరంలోని ప్రముఖ బంగారం, వస్త్రాల వ్యాపార సంస్థ అధినేత మావూరి వెంకటరమణ ధ్వజ స్తంభం స్వర్ణతాపడానికి అయ్యే ఖర్చును విరాళంగా సమర్పిస్తున్నారు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ ధ్వజస్తంభం స్వర్ణ తాపడం పనులు చేపట్టనుంది. ఈనేపథ్యంలో ధ్వజస్తంభం స్వర్ణతాపడం పనులు శుక్రవారం సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి.

Simhachalam Appanna Temple: అప్పన్న ఆలయంలో స్వర్ణ కాంతుల ధ్వజ స్తంభం.. బంగారు తాపడం పనుల ప్రారంభం
Simhachalam Appanna Temple
Eswar Chennupalli
| Edited By: Surya Kala|

Updated on: Aug 19, 2023 | 9:36 AM

Share

హిందు మతాన్ని అనుసరించి దేవాలయాలకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా ప్రధాన దేవతా విగ్రహం వుండే గర్బాలయం. ఇది గర్బగుడి ముందున్న ప్రదేశమైన అంతరాలయంతో పాటు ప్రధాన ఆలయం ఎదురుగా ఉండే ధ్వజస్తంభం. ఇది ఒక స్తంభం మాత్రమే కాదు.. ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. సాధారణంగా దీనిని కర్రతోగాని, రాయితోగాని, లోహముతో గాని తయారు చేసి నిలబెడతారు. అలాంటి వాటికి స్వర్ణ తాపడం చేయిస్తే ఇక అది పెద్ద విశేషమే. అలాంటి ప్రయత్నమే సింహాచలం అప్పన్న ఆలయంలో జరుగుతోంది.

కోటి ఎనభై లక్షల రూపాయలతో స్వర్ణ తాపడం పనులు ప్రారంభం

దక్షిణ భారతదేశంలో ప్రముఖ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ధ్వజస్తంభం స్వర్ణతాపడం పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. కోటీ ఎనభై లక్షల రూపాయల అంచనాతో ప్రస్తుతం ఉన్న రాగి రేకుపై బంగారు తాపడాన్ని చేయించనున్నారు. ఇందు కోసం కిలో ఆరువందల గ్రాముల బంగారం అవసరం కానున్నట్టు అంచనా వేశారు.

విశాఖనగరంలోని ప్రముఖ బంగారం, వస్త్రాల వ్యాపార సంస్థ అధినేత మావూరి వెంకటరమణ ధ్వజ స్తంభం స్వర్ణతాపడానికి అయ్యే ఖర్చును విరాళంగా సమర్పిస్తున్నారు. చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ ధ్వజస్తంభం స్వర్ణ తాపడం పనులు చేపట్టనుంది. ఈనేపథ్యంలో ధ్వజస్తంభం స్వర్ణతాపడం పనులు శుక్రవారం సాంప్రదాయంగా ప్రారంభమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఆగమశాస్త్రాన్ని అనుసరించి….

దాతలు విరాళాలు ఇచ్చినా మాత్రాన ధ్వజస్తంభం బంగారు కాంతులలీనాలంటే ఆగమశాస్త్రాన్ని అనుసరించాల్సిందే. అందులో భాగంగా దేవాలయ అర్చకులు ధ్వజస్తంభం వద్ద పూజాధికార్యక్రమాలు  నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశావాహనం చేశారు.

48 అడుగుల ఎత్తయిన ఈ ధ్వజ స్తంభం పై ప్రస్తుతం ఉన్న రాగి రేకులను కూలీలు జాగ్రత్తగా తొలగిస్తున్నారు. నెలరోజుల్లో పనులు పూర్తి చేసి తీసుకువస్తామని కాంట్రాక్టర్ రామచంద్ర రెడ్డి టీవీ9 ప్రతినిధికి తెలియజేసారు. ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం పనుల నేపథ్యంలో కొన్ని లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి సంప్రదాయ బద్దంగా తయారు చేయాలని వైదిక పెద్దలు సూచించినట్టు కాంట్రాక్టర్ తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..