- Telugu News Photo Gallery Cricket photos Asia Cup 2023: Team India Skipper Rohit Sharma scripts many records with his knock against Nepal
IND vs NEP: ఆసియా కప్‌లో రోహిత్ శర్మ రికార్డులు జోరు.. సచిన్, రైనా లెక్కలకు చెల్లు.. ఒకే ఇన్నింగ్స్‌తో మొత్తం 5..
IND vs NEP: ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మ్యాచ్‌లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ , శుభమాన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగుల చేయడంతో పాటు ఏకంగా 5 రికార్డులను తిరగరాశాడు. ఇంతకీ రోహిత్ తిరగరాశిన ఆ రికార్డులు ఏమిటంటే..?
Updated on: Sep 05, 2023 | 10:17 AM

నేపాల్‌పై 74 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఆసియా కప్ టోర్నీలో తన 10వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో టోర్నీ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా హిట్ మ్యాచ్ నిలవగా.. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్(9), మూడో స్థానంలో విరాట్ కోహ్లీ(8) ఉన్నారు.

నేపాల్‌పై 5 సిక్సర్లతో చెలరేగిన హిట్‌మ్యాన్ వన్డే క్రికెట్‌లో 250 సిక్సర్లు బాదిన మూడో ఓపెనర్‌గా అవతరించాడు. రోహిత్ కంటే ముందు ముందు క్రిస్ గేల్, సనత్ జయసూర్య తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

అలాగే 30 సార్లు ఒకే ఇన్సింగ్స్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన టీమిండియా ప్లేయర్‌గా కూడా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు.

ఆసియా కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మూడో ఆటగాడిగా కూడా విరేందర్ సెహ్వాగ్(5), సురేష్ రైనా(5) రికార్డులను రోహిత్(5) సమం చేశాడు. సౌరవ్ గంగూలీ(7), ఎంఎస్ ధోని(6) ఆసియా కప్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లుగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇంకా ఆసియా కప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు. రోహిత్ మొత్తం 22 సిక్సర్లు బాదగా.. సురేష్ రైనా 18 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.





























