- Telugu News Photo Gallery Cricket photos BCCI announced 15 Member Team India squad for ICC World Cup 2023 Today at 1 30 pm
ICC ODI World Cup 2023: నేడే భారత జట్టు ప్రకటన.. వన్డే ప్రపంచకప్ 2023 బరిలో నిలిచే ఆ 15 మంది ఎవరు?
India Team for ODI World Cup 2023: ఈ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాండీలో విలేకరుల సమావేశం జరగనుంది. ఇక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ, BCCI సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ICC ODI ప్రపంచ కప్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించనున్నారు. కేఎల్ రాహుల్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
Updated on: Sep 05, 2023 | 10:06 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టును నేడు ప్రకటించనున్నారు. శనివారం అర్థరాత్రి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాను ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రకటించనున్నారు.

ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు క్యాండీలో విలేకరుల సమావేశం జరగనుంది. అక్కడ కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ జట్టు పేరును ప్రకటిస్తారు. కేఎల్ రాహుల్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. సంజూ శాంసన్‌ని తొలగించినట్లు సమాచారం.

ఆసియా కప్ 2023లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య క్యాండీలో జరిగిన మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్‌లను కలిసిన తర్వాత అజిత్ అగార్కర్ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. ఆసియా కప్ 2023 కోసం ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న సంజు శాంసన్, తిలక్ వర్మ, ప్రసీద్ధ్ కృష్ణలు భారత ప్రపంచ కప్ జట్టు నుంచి తప్పించబడ్డారు.

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను నడిపించనున్నారు. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు తప్పకుండా ఉంటారు.

భారత బ్యాటింగ్ లైనప్‌పై సెలక్షన్ కమిటీ మరియు టీమ్ మేనేజ్‌మెంట్ చాలా శ్రద్ధ చూపింది. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్‌లను ఇందుకోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

మొత్తం ప్రపంచకప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా వివిధ మైదానాల్లో నిర్వహించనున్నారు. అక్టోబరు 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

భారతదేశం గర్వించదగ్గ స్టేడియంగా పేరొందిన నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభానికి ఒకరోజు ముందు ప్రారంభోత్సవం జరిగింది. అక్టోబర్ 4న ఘనంగా ప్రారంభోత్సవం జరగనుంది. టీమ్ లీడర్లందరూ ఇందులో పాల్గొంటారు.

ఆసియా కప్ తర్వాత, ప్రపంచకప్‌కు ముందు సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు ఆస్ట్రేలియాతో భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన ఆటగాళ్లనే ఈ సిరీస్‌కు ఎంపిక చేస్తుంది.





























