- Telugu News Photo Gallery Cricket photos Virat Kohli completed 100 catches in multi nations events in asia cup 2023 ind vs nep match
Virat Kohli: వన్డే క్రికెట్‌లో ‘క్యాచ్’ల గణాంకాలు.. కోహ్లీ ఖాతాలో చేరిన 3 రికార్డులు..
Virat Kohli Records: నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో కింగ్ కోహ్లీ తన ఖాతాలో మూడు రికార్డులను వేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో ఓ అద్భుతమై క్యాచ్ పట్టుకోవడంతో క్యాచ్‌ల రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. కింగ్ కోహ్లీ 277 వన్డే మ్యాచ్‌ల్లో మొత్తం 143 క్యాచ్‌లు అందుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచంలో నాలుగో ఫీల్డర్‌గా నిలిచాడు.
Updated on: Sep 04, 2023 | 10:41 PM

ఆసియా కప్‌లో 5వ మ్యాచ్‌లో క్యాచ్ పట్టడం ద్వారా విరాట్ కోహ్లీ 3 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతోపాటు వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 4వ ఆటగాడిగా నిలిచాడు.

నేపాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసిఫ్ షేక్ ఇచ్చిన క్యాచ్ పట్టుకోవడం ద్వారా, మల్టీ నేషన్ టోర్నమెంట్‌లలో 100 క్యాచ్‌లు పట్టిన 2వ భారతీయుడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.

అలాగే పలు దేశాలు పాల్గొనే టోర్నీలో అత్యధిక క్యాచ్ పట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రికార్డును సమం చేశాడు.

బహుళ దేశాల టోర్నీలో 100 క్యాచ్‌లు పట్టిన తొలి భారతీయుడిగా అజహర్ నిలిచాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా వంద క్యాచ్‌లు పట్టడం ద్వారా ఈ రికార్డును సమం చేశాడు. ఈ ఘనత సాధించిన 2వ భారతీయుడిగా కూడా నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 2వ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో కూడా అజారుద్దీన్ అగ్రస్థానంలో ఉన్నాడు.

334 వన్డేల్లో మొత్తం 156 క్యాచ్‌లతో మహ్మద్ అజారుద్దీన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం.

277 వన్డే మ్యాచుల్లో మొత్తం 143 క్యాచ్‌లు పట్టడం ద్వారా కింగ్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్రపంచంలో నాలుగో ఫీల్డర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనే అగ్రస్థానంలో ఉన్నాడు. జయవర్ధనే 218 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 160 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే భారత ఆటగాడు అజారుద్దీన్ 156 క్యాచ్‌లతో 3వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 143 క్యాచ్‌లతో 4వ స్థానంలో నిలిచాడు.

ఇప్పుడు కేవలం 277 వన్డేల్లో మొత్తం 143 క్యాచ్‌లు పట్టిన విరాట్ కోహ్లీ 4వ స్థానానికి చేరుకున్నాడు. దీంతో ఫీల్డింగ్‌లోనూ సరికొత్త రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేశాడు.

అంటే రానున్న మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లి 14 క్యాచ్‌లు పట్టినట్లయితే, టీమిండియా తరపున వన్డే క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆసియాకప్‌లో ఆడుతున్న కోహ్లి రానున్న వన్డే ప్రపంచకప్‌లోనైనా ఈ ఘనత సాధిస్తాడో లేదో చూడాలి.




