Vemulawada: అక్కడ మారుతున్న యువత ఆలోచన.. శివపార్వతులుగా మారి అమ్మవారి అవతారంలో శివయ్య సేవలో..

వృద్ధాప్యంలో ఉన్న వారు.. ఎక్కువగా శివపార్వతులుగా మారుతుంటారు.. అలా మారిన వారు.. తమ కుటుంబాన్ని వదిలిపెట్టి.. దైవ సన్నిదిలోనే గడుపుతారు. అయితే.. ఇప్పుడు యువత  కూడా శివపార్వతులుగా మారుతున్నారు.  అమ్మవారి అవతారమెత్తుతున్నారు. కుటుంబ సంబంధాలకు దూరంగా ఉండి ..  దైవ సన్నిధిలోనే జీవి స్తున్నారు. శివపార్వతులుగా మారుతున్న యువకుల సంఖ్య రోజు.. రోజుకు పెరుగుతుంది. శివుడు కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా శివపార్వతులుగా మారిన యువత తో సేవలు అందుకుంటున్న దైవం ఎవరంటే.. 

G Sampath Kumar

| Edited By: Surya Kala

Updated on: Sep 05, 2023 | 2:01 PM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయాన్ని దక్షిణ కాశిగా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి వేయి  సంవత్సరాల చరిత్ర ఉంది. నిత్యం ఆలయంలో భక్తుల రద్దీ ఉంటుంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో జోగినిగా మారి స్వామి వారికి అంకితమయ్యేవారు. అదే సమయంలో చాలా ఏళ్ల నుంచీ శివపార్వతులుగా మారుతున్నవారు ఉన్నారు. దాదాపు ప్రతి గ్రామంలో శివపార్వుతులు ఉంటారు. ఏమైనా అనారోగ్య నుంచి బయటపడితే  శివపార్వతులగా మారుతుంటారు. దేవుడికి మొక్కుకొని మంచి జరిగితే శివపార్వతులగా మారుతారు. అటు.. ఆడవారు... ఇటు మగవారు కూడా.. ఈ విధంగా మారుతున్నారు.

1 / 7
గతంలో ఎక్కువగా ఆడవారు మాత్రమే.. శివపార్వతులుగా మారి.. స్వామి వారి సన్నిధిలో గడిపేవారు... ఇటీవల  శివపార్వతులగా మగవారు మారుతున్నారు. అందులో యువత ఎక్కువగా మారుతుంది. చదువు ను సైతం పక్కకు పెట్టి శివుడికి అంకితమవుతున్నారు. పూర్తిగా ఆధ్మాత్మికవాదం వైపు వెళ్తున్నారు. డిగ్రీలు. పేజీలు చేసిన వారు కూడా శివపార్వతులుగా మారుతున్నారు. శివుడు.. అర్థనారీశ్వరుడు... దీంతో మగ, ఆడ అనే తేడా లేకుండా శివపార్వుతులుగా మారి అమ్మవారిలా తయారువుతున్నారు. వీరు జీవితాంతం ఇదే వేషాధారణతో ఉంటారు. కొంత మంది మాత్రం మాములు వేషాధారణలో జీవిస్తారు.

2 / 7
ప్రతి గ్రామంలో ఇద్దరు, ముగ్గురు యువకులు శివపార్వతులగా మారుతున్నారు. దేవుడి కోరిక మేరకే.. ఇలా మారిపోయామని అంటున్నారు. మగవారు శివపార్వతులుగా మారితే కట్టుబొట్టులో తేడా ఉంటుంది. చీర ధరించడం. గాజులు పెట్టుకోవడం మట్టెలు ధరించడంతో పాటు మంగళసూత్రం కూడా వేసుకుంటున్నారు. కొంత మంది పెళ్లి చేసుకుని కూడా... శివపార్వతులుగా ఉంటున్నారు. మరి కొంత పెళ్లి లేకుండా.. జీవితం మొత్తం రాజన్నకు అంకితం అవుతున్నారు. 

3 / 7
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఓ యువకుడు వయస్సు 22... అందరూ లాగానే పాఠశాలకు వెళ్లాడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. పదేళ్ల క్రితం ఇతనికి దేవుడు కలలో కనబడటంతో పాటు.. అనారోగ్యానికి గురి కావడంతో.. శివపార్వతిగా మారిపోయారు. ఇప్పుడు పూర్తిగా అమ్మవారి అవతారంలోనే కనబడుతున్నాడు. ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్నాడు. వారంలో రెండు సార్లు వేములవాడ వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నాడు. 

4 / 7
ఇదే గ్రామానికి చెందిన మరో యువకుడు కూడా చిన్న వయస్సులో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు.  రాజన్నకు మొక్కుకోవడంతో ఆరోగ్యం బాగుపడింది. శివపార్వతిగా మారిపోయాడు.. ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేశాడు. చాలా మంది ఎగతాళి చేయడంతో.. కళాశాలకు వెళ్లలేకపోయాడు. ఈ యువకుడు  వేములవాడకు వెళ్తే అమ్మవారి లాగా తయారై మొక్కులు చెల్లించుకుంటాడు. ఇంటి వద్ద ఉంటే మెట్టెలు, తాళి ధరిస్తాడు. ప్రతి నిత్యం దేవుడి సేవలో గడుపుతున్నాడు. అదే విధంగా.. మరో యువకుడు చిన్న వయస్సులో తీవ్రమైన అనారోగ్యానికి గురి కావడంతో శివపార్వతిగా మారిపోయి.. భవానిగా పేరు మార్చుకున్నాడు. పూర్తిగా.. అమ్మవారి అవతారంలో ఉంటున్నాడు... ఇంట్లో వద్దని చెప్పినా.. శివపార్వతిగా మారిపోయాడు. రాము అనే యువకుడు కూడా శివపార్వతిగా మారిపోయాడు.. మగవారి డ్రెస్ ధరించినా చేతికి గాజులు వేసుకుంటాడు, మెట్టెలు ధరిస్తున్నాడు. దేవుడి కోరిక మేరకే శివపార్వతిలాగా మారిపోయాయని అంటున్నాడు. తమ వంశీయులు కూడా. శివపార్వతులు ఉన్నారని చెబుతున్నాడు

5 / 7
వేములవాడ ఆలయంలో సోమ, శుక్రవారం రోజుల్లో ఇతర పర్వదినాల్లో శివపార్వతుల సందడి కనబడుతుంది. ఎంతో వైభవంగా పోచమ్మకు భోనాలు చెల్లిస్తారు. స్వామి వారి దర్శనం తరువాత పోచమ్మకు బోనాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాదు రాజన్న ఆలయంలో శ్రీరామ నవమి రోజు ఓ వైపు శ్రీరాముడు కళ్యాణం జరుగుతుంటే.. అదే సమయానికి శివపార్వతులు శివుడిని పెళ్లిచేసుకుంటారు. పెళ్లి కూతురులా ముస్తాబై శివుడిని భర్తగా భావిస్తారు. ఒక్కరిపై ఒక్కరు ఆక్షింతలు వేసుకుంటారు.

6 / 7
ప్రతి శ్రీరామ నవమి రోజున వేలాది మంది శివపార్వతులు తరలివస్తారు. చేతిలో త్రిశూలం పట్టుకొని.. నొదుటపై బొట్టు పెట్టుకొని నూతన వధువులా తయారై.. స్వామి వారిని వి వాహం చేసుకుంటారు. అయితే  కొంత మంది దేవుడి కోసం జీవితం సమర్పిస్తారు. మరి కొంత మంది.. నకిలీ శివపార్వతులు తయారవుతున్నారు. దీంతో నిజమైన శివపార్వతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో వేములవాడ పోలీస్ స్టేషన్లో నకిలి శివపార్వతులపై కేసులు కూడా నమోదయ్యాయి. దేవుడుపై భక్తి, ప్రేమ ఉంటే శివ పార్వతులుగా మారాలని.. అంతేకాని డబ్బు కోసమో మరి దేనికోసమో నకిలీ శివపార్వతులుగా మరవద్దని కోరుతున్నారు. మొత్తానికి చాలా మంది యువకులు శివపార్వతులగా మారి, దైవుడి సేవ చేస్తున్నారు. 

7 / 7
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?