AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WC 2023: ప్రపంచ వేదికపై ‘విరాట్ కోహ్లీ vs నవీన్ ఉల్ హక్’.. ఆఫ్గాన్ జట్టులోకి మ్యాంగో మ్యాన్ రీఎంట్రీపై నెటిజన్ల రియాక్షనిదే..

వన్డే వరల్డ్ కప్ కోసం అఫ్గానిస్తాన్ తమ జట్టును ప్రకటించింది. క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. విరాట్ కోహ్లీతో గొడవ పడిన నవీన్ ఉల్ హక్‌కి కూడా జట్టులో అఫ్గానిస్తాన్ సెలెక్టర్స్ స్థానం కల్పించారు. అక్టోబర్ 11న న్యూ ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం భారత్ vs ఆఫ్గాన్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దీంతో తమ ముందు నవీన్ ఉల్ హక్‌ని కోహ్లీ ఉతికేయాలని ఢిల్లీలోని క్రికెట్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గొప్పగా చెప్పుకునే షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా వంటి బౌలర్లనే

WC 2023: ప్రపంచ వేదికపై ‘విరాట్ కోహ్లీ vs నవీన్ ఉల్ హక్’.. ఆఫ్గాన్ జట్టులోకి మ్యాంగో మ్యాన్ రీఎంట్రీపై నెటిజన్ల రియాక్షనిదే..
Naveen-ul-Haq vs Virat Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Sep 14, 2023 | 11:51 AM

Share

భారత్ వేదికగా జరిగే ప్రపంచ కప్ 2023 మెగా టోర్నీ కోసం అఫ్గానిస్తాన్ తన జట్టును ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి ప్రాంరభమయ్యే ఈ టోర్నీలో ఆఫ్గాన్ జట్టును హష్మతుల్లా షాహిదీ నడిపించనున్నాడు. 15 మందితో కూడిన అఫ్గానిస్తాన్ జట్టులో రహ్మతుల్లా గుర్బాజ్, మహ్మద్ నబి, రషిద్ ఖాన్, నూర్ అహ్మద్, అబ్దుల్ రెహ్మాన్ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించింది. అయితే ఈ జట్టులో క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే.. నవీన్ ఉల్ హక్‌కి కూడా జట్టులో అఫ్గానిస్తాన్ సెలెక్టర్స్ స్థానం కల్పించారు. ఐపీఎల్ 2023 టోర్నీలో విరాట్ కోహ్లీతో గొడవ పడిన నవీన్.. ప్రపంచ కప్ వేదిగా మళ్లీ కింగ్‌ కంట పడబోతున్నాడు. దీంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

విశేషం ఏమిటంటే.. వరల్డ్ కప్‌లో భారత్ vs ఆఫ్గాన్ మ్యాచ్‌ కింగ్ కోహ్లీ సొంత మైదానంలోనే జరగబోతోంది. అక్టోబర్ 11న న్యూ ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దీంతో తమ ముందు నవీన్ ఉల్ హక్‌ని కోహ్లీ ఉతికేయాలని ఢిల్లీలోని క్రికెట్ అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గొప్పగా చెప్పుకునే షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా వంటి బౌలర్లనే కింగ్ కోహ్లీ ఉతికేశాడు, జట్టులో స్థానమే అనుమానంగా ఆడే నవీన్ ఎంత’ అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంకా రకరకాల మీమ్స్‌తో సందడి చేసుకుంటున్నారు. వాటిపై ఓ లుక్ వేద్దాం..

పండగే..

మజా ఆయేగా..

రౌండ్ 2..

మసాలా సరిపోద్దిగా..

సిద్ధమవ్వండి..

ఇదేగా కావాల్సింది..

రిపీట్ అవ్వాల్సిందే..

ఉతుకుడే..

వరల్డ్ కప్ ‌కోసం ఆఫ్గానిస్తాన్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహిమ్ జద్రాన్, రియాజ్ హాసన్, రహ్మత్ షా, నజిబుల్లా జద్రాన్, మహ్మద్ నబి, ఇక్రమ్ అలిఖిల్, అజ్మతుల్లా ఒమర్జై, రషిద్ ఖాన్, ముజిబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫరుఖీ, అబ్దుల్ రెహ్మాన్, నవీన్ ఉల్ హక్

ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
ఖడ్గం సినిమాలో ఆ సీన్ ఎందుకు పెట్టామంటే..
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..