- Telugu News Photo Gallery Cricket photos Suryakumar Birthday: Team India batter top records and love story with wife Devisha Shetty
Suryakumar Yadav: ధనాధన్ సూర్య మంగళూరు బ్యూటీకి ఎలా బౌల్డయ్యాడో తెలుసా? 360 డిగ్రీ ప్లేయర్ లవ్ స్టోరీ..
టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ ఈరోజు (సెప్టెంబర్ 14) తన 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా వెలుగొందుతోన్న సూర్యకుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి సూర్య కుమార్ బర్త్ డే సందర్భంగా అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
Updated on: Sep 14, 2023 | 2:19 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో 200-ప్లస్ స్ట్రైక్ రేట్‌తో నాలుగు సార్లు యాభై-ప్లస్ స్కోర్లు చేసిన ఏకైక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. 2023లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతను ఈ అరుదైన ఘనత సాధించాడు.

IPL 2023 సీజన్‌లో 180 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 600 ప్లస్ పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. rj ట్వంటీ-20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కూ

2022 వరకు ఒకే సంవత్సరంలో 1,000 ప్లస్ T20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక భారతీయ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఒక ఏడాదిలో అత్యధిక టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ఆటగాడు కూడా అతనే. మొత్తం 68 సిక్సర్లు కొట్టాడు సూర్య.

సూర్య ప్రేమకథ విషయానికి వస్తే, అతను జూలై 2016 లో దేవిషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. విశేషమేమిటంటే వీరిద్దరూ కాలేజీలో ప్రేమించుకున్నారు. సూర్య దేవిషాకు ప్రపోజ్ చేయడం, ఆమె కూడా అంగీకరించడం, ఇరు పెద్దలు కూడా ఆశీర్వాదం తెలపడంతో పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్డ్స్.