- Telugu News Photo Gallery Cricket photos Team India Run Machine Virat Kohli completes 300 wins in international cricket after sachin tendulkar
Virat Kohli: ప్రపంచ రికార్డ్ లిఖించిన విరాట్ కోహ్లీ.. అరుదైన జాబితాలో ఇద్దరే భారతీయులు.. అదేంటో తెలుసా?
Virat Kohli Records: ప్రత్యేకమైన ఈ జాబితాలో కేవలం ఇద్దరు భారతీయులు మాత్రమే ఉన్నారు. వారిలో కింగ్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ జాబితాలో భాగమయ్యాడు. అయితే, మరో 8 మ్యాచ్‌లతో క్రికెట్ దేవుడి రికార్డును బ్రేక్ చేసేందుకు రన్ మెషీన్ సిద్ధమయ్యాడు. కాగా, ఇలాంటి రికార్డులో అంతర్జాతీయంగా కేవలం ఆరుగులు ప్లేయర్లు మాత్రమే చేరారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
Updated on: Sep 13, 2023 | 8:06 PM

Virat Kohli Records: ఈ ఏడాది ఆసియాకప్ 2023లో టీమిండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. భారత జట్టు సాధించిన ఈ మూడు విజయాలతో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

అంటే శ్రీలంకపై విజయం విరాట్ కోహ్లీకి 300వ విజయం. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లలో విజయం రుచి చూసిన అతి కొద్ది మంది ఆటగాళ్ల జాబితాలో కింగ్ కోహ్లీ కూడా చేరాడు.

విశేషమేమిటంటే ఈ జాబితాలో ఇద్దరు భారతీయులు మాత్రమే ఉన్నారు. వారిలో కింగ్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో 300 మ్యాచ్‌లలో విజయంలో భాగమయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 664 మ్యాచ్‌లు ఆడిన సచిన్ టెండూల్కర్ మొత్తం 307 మ్యాచ్‌లు గెలిచాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ ఈ రికార్డును బద్దలు కొట్టే పనిలో ఉన్నాడు.

ఎందుకంటే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 505 మ్యాచ్‌లు ఆడగా, భారత జట్టు 300 మ్యాచ్‌లు గెలిచింది. దీంతో 300 విజయాల్లో భాగమైన ప్రపంచ 6వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. టీమ్ ఇండియా మరో 8 సార్లు గెలిస్తే కింగ్ కోహ్లి పేరిట కొత్త రికార్డు చేరినట్లే.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పాంటింగ్ 560 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. వాటిలో 377 గెలిచాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 300+ మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది. రికీ పాంటింగ్ (377), మహేల జయవర్ధనే (336), సచిన్ టెండూల్కర్ (307), జాక్వెస్ కలిస్ (305), కుమార సంగక్కర (305), విరాట్ కోహ్లీ ( 300).





























