Weekly Horoscope: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి వారఫలాలు
వారఫలాలు: మేష రాశి వారికి ఈ వారమంతా బాగానే గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశముంది. వృషభ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
వారఫలాలు: మేష రాశి వారికి ఈ వారమంతా బాగానే గడిచిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశముంది. వృషభ రాశివారికి ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా బాగానే గడిచిపోతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కొద్దిగా పట్టు విడుపులతో వ్యవహరిస్తే బంధు మిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. అనేక మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా పెరుగు తుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయా ణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దగ్గర బంధువులతో వివాహాది శుభ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): సొంత ఆలోచనలు, నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. అయితే, ధన వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి పనులు చేపట్టినా అవి విజయవంతంగా పూర్తవుతాయి. జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ధన స్థానంలో ఏర్పడ్డ బుధాదిత్య యోగం వల్ల ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి, ఉద్యో గాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి కరువవుతుంది. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. దాదాపు అన్ని రంగాల వారి మీదా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహా రాల్లో విజయం లభిస్తుంది. ఈ రాశి మీద గురు దృష్టి ఉన్నందువల్ల ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యక్తిగత సమస్యలను సమయ స్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకు వెడతారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది. అయితే, అనుకూల వాతా వరణం ఉంటుంది. ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి సకా లంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయ త్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): స్థిరాస్తికి సంబంధించిన వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వారం చివర్లో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుటుంబ సమస్యల విష యంలో జీవిత భాగస్వామిని కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు మార్గం సుగమం అవుతుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో జీత భత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభ వార్తలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవ కాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల ప్రమే యంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహన యోగం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా, నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కొన్ని వివాదాలు, సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణ యాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహాలను కూడా తీసుకోవడం మంచిది. పలుకు బడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో కొద్దిగా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత, సామరస్యం ఏర్పడతాయి. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.
Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.