- Telugu News Photo Gallery Beer is good to get rid of kidney stones, is it True or not? check to know
kidney Stones: బీర్ తాగితే కిడ్నీ స్టోన్ కరిగిపోతాయా..? అధ్యయనాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం రండి..
Kidney Stones: కిడ్నీ సమస్యలతో బాధపడేవారి సంఖ్య భారతదేశంలో ప్రస్తుతం పెరిగిపోయింది. చిన్నా పెద్దా అని వయసుతో తేడా లేకుండా కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఫెయిల్యూవర్ వంటి కిడ్నీ సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనే కొందరు అదే పనిగా మద్యపానం చేస్తున్నారు. నిజంగా బీర్ తాగితే కిడ్నీ రాళ్లు కరిగిపోతాయా..?
Updated on: Sep 16, 2023 | 12:07 PM

బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలో వెయ్యి మందిపై చేసిన ఓ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు బీర్ తాగడమే ఉత్తమ చికిత్స అని భావించేవారు ప్రతి ముగ్గురిలో ఒకరు ఉన్నారని తెలిసింది.

అయితే బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయనేది కేవలం వాదన మాత్రమేనని, ఇది ఏ మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. బీర్ తాగడం వల్ల మూత్ర విసర్జన పెరుగుతుందని, మూత్రంతో పాటు కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయని కొందరు భావిస్తున్నారు కానీ అది కేవలం అపోహ మాత్రమేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

బీర్ తాగడం వల్ల పెరిగిన మూత్ర విసర్జనతో మూత్ర ప్రవాహంలో 3 మి.మీ పరిమాణం కలిగిన రాళ్ల గుళికలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అంతేకానీ బీర్ తాగడానికి, కిడ్నీలో రాళ్లు కరగడానికి ఏ మాత్రం సంబంధం లేదంటున్నారు.

పైగా ఎక్కువ మొత్తంలో బీర్ తాగడం వల్ల కిడ్నీ రోగుల శరీరం వెంటనే డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటుంది. ఇంకా అధిక బరువు, కాలేయానికి హాని కలుగుతుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించేందుకు నీరు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కిడ్నీ బీన్స్, తాజా కూరగాయలు, దానిమ్మ వంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు తగ్గే అవకాశం ఉంది.





























