Pan India Market: పాన్ ఇండియా మార్కెట్ టాలీవుడ్ చేతుల్లోంచి జారిపోతుందా..? ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
టాలీవుడ్ చేతుల్లోంచి పాన్ ఇండియన్ సినిమా జారిపోతుందా..? పసలేని సినిమాలతో అనవసరంగా బంగారం లాంటి మార్కెట్‌ను పాడు చేసుకుంటున్నారా..? ట్రిపుల్ ఆర్, కార్తికేయ 2 తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియన్ సినిమా రాకపోవడానికి కారణమేంటి.. మన కథల్లో సత్తా తగ్గిందా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ తీస్తుందా..? మళ్లీ పాన్ ఇండియా మన చేతుల్లోకి వచ్చేదెప్పుడు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ. నాణేనికి ఒకవైపు మాత్రమే చూసి టాలీవుడ్ కత్తి, తోపు అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. కానీ ఆ రెండో వైపు కూడా ఉంది. అది తెలిస్తే షాక్ అవుతారు.
Updated on: Sep 16, 2023 | 12:00 PM

టాలీవుడ్ చేతుల్లోంచి పాన్ ఇండియన్ సినిమా జారిపోతుందా..? పసలేని సినిమాలతో అనవసరంగా బంగారం లాంటి మార్కెట్‌ను పాడు చేసుకుంటున్నారా..? ట్రిపుల్ ఆర్, కార్తికేయ 2 తర్వాత తెలుగు నుంచి పాన్ ఇండియన్ సినిమా రాకపోవడానికి కారణమేంటి.. మన కథల్లో సత్తా తగ్గిందా లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ తీస్తుందా..? మళ్లీ పాన్ ఇండియా మన చేతుల్లోకి వచ్చేదెప్పుడు..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

నాణేనికి ఒకవైపు మాత్రమే చూసి టాలీవుడ్ కత్తి, తోపు అంటూ అందరూ తెగ పొగిడేస్తున్నారు. కానీ ఆ రెండో వైపు కూడా ఉంది. అది తెలిస్తే షాక్ అవుతారు. ఏంటి ఇవన్ని తెలుగు ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయా అనిపిస్తుంది అది తెలిసాక. గత రెండేళ్లుగా ఎంతటి భారీ విజయాలొచ్చాయో.. వాటిని మించిన భారీ పరాజయాలు కూడా తెలుగులోనే వచ్చాయంటే నమ్మడం సాధ్యం కాదు.

బయట ప్రపంచం మొత్తం కేవలం బాహుబలి, త్రిబుల్ ఆర్, కార్తికేయ 2, పుష్ప లాంటి సినిమాలను మాత్రమే చూస్తుంది. వాటిని చూసి టాలీవుడ్‌కు తిరుగులేదు.. అక్కడ నిర్మాతలకు ఎదురు లేదనుకుంటున్నారు. కానీ లోపల భోళా శంకర్, లైగర్, ఏజెంట్, రాధే శ్యామ్, శాకుంతలం లాంటి ఎన్నో గాయాలున్నాయి. పైగా పాన్ ఇండియన్ సినిమాలే వరసగా డిజాస్టర్స్ అవుతున్నాయి.

హిట్స్ చూసి జబ్బలు చరుచుకుంటున్నారు కానీ పాన్ ఇండియా పేరు చెప్పి విడుదల చేసిన సినిమాలు తీసుకొచ్చిన నష్టాల నుంచి నిర్మాతలు ఇంకా బయటపడలేకపోతున్నారు. రాధే శ్యామ్‌కు 80 కోట్లు.. శాకుంతలం, లైగర్‌కు 50 కోట్లు.. ఏజెంట్‌కు 40 కోట్లు నష్టాలొచ్చాయని ట్రేడ్ అంచనా. ఈ లెక్కలు చూసాక.. పాన్ ఇండియా టాలీవుడ్ చేజారిపోతుందేమో అనిపిస్తుంది.

అటు పాన్ ఇండియా లాభాలు.. ఇటు నష్టాలు రెండింటికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతుంది తెలుగు సినిమా. దానికితోడు ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ కూడా పడుతుంది. ఇది మారాలంటే రాబోయే పుష్ప 2, సలార్, ప్రాజెక్ట్ K, దేవర, గేమ్ ఛేంజర్ లాంటి సినిమాలన్నీ సత్తా చూపించాలి. ఇవన్నీ కానీ హిట్టైతే అప్పుడు నిజంగానే టాలీవుడ్‌కు తిరుగుండదు.. అది చూసి బాలీవుడ్ సహా ఎవరికీ నిద్రుండదు.




