- Telugu News Photo Gallery Cinema photos Actress Meena Birthday special story about her life telugu cinema news
Meena Birthday: కథ చెప్పే ఆ కళ్లు.. అద్భుతమైన రూపం.. నటనతో హృదయాలను దొచేసిన హీరోయిన్ మీనా..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మీనా. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈరోజు మీనా బర్త్ డే. 1975 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించింది. శివాజీ గణేశన్ నటించిన నెంచంగల్ సినిమాతో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన అన్పుల్ సినిమాతో ప్రశంసలు అందుకుంది.
Updated on: Sep 16, 2023 | 11:38 AM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మీనా. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఈరోజు మీనా బర్త్ డే. 1975 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించింది.

శివాజీ గణేశన్ నటించిన నెంచంగల్ సినిమాతో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత రజినీకాంత్ నటించిన అన్పుల్ సినిమాతో ప్రశంసలు అందుకుంది. తెలుగులో సరిగమలు సినిమాలోనూ బాలనటిగా నటించి మెప్పించింది మీనా.

తెలుగుతోపాటు తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మీనా.. ఆ తర్వాత కథానాయికగానూ ఓ వెలుగు వెలిగింది. రాజేంద్ర ప్రసాద్ నటించిన నవయుగం సినిమాతో హీరోయిన్ గా తెరపై సందడి చేసింది.

ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సరసన నటించి అలరించింది.తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుంది మీనా. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. ఆమె కూతురు తేరీ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. గతేడాది మీనా భర్త తుదిశ్వాస విడిచారు.

కళ్లతో కథ చెప్పే విలక్షణమైన నటనతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది మీనా. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తోంది మీనా.




