- Telugu News Photo Gallery Eat these 5 dry fruits to get rid of digestion problems like acidity and constipation
Health Benefits: జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..? ఈ 5 డ్రై ఫ్రూట్స్ తీసుకున్నారంటే సమస్య పరార్..
Digestion Problems: సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని పాటించకపోవడం వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది మలబద్దకం, ఎసిడిటీ, కడుపులో మంట వంటి పలు రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. లేదంటే ఆయా సమస్యలు శరీర ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అవేమింటే..
Updated on: Sep 16, 2023 | 12:37 PM

ఎండిన అలుబుఖారా: ప్లమ్ ఫ్రూట్ లేదా అలుబుఖారా పండ్లు మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలను నయం చేయడంలో మెరుగ్గా పనిచేస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉన్న ఈ పండ్లను తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి.

అంజీర్: అంజీర్ లేదా అత్తి పండ్లు ఫైబర్ రిచ్ ఫుడ్. ఫలితంగా మీరు అన్ని రకాల జీర్ణ సమస్యల నుంచి తేలికగా ఉపశమనం పొందవచ్చు. అలాగే వీటిల్లో ఫైబర్ మాత్రమే కాక ప్రోటీన్, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పోషకాలు కూడా ఉన్నాయి.

ఖర్జూరం: ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఫైబర్‌తో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి పలు విటమిన్లు ఉన్నందున ఖర్జూరాలు మలబద్ధకం, అజీర్తి సమస్యలకు చెక్ పెడతాయి. ఇంకా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు మీ దరి చేరనీయకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

బ్లాక్ రైసిన్స్: నల్ల ఎండుద్రాక్ష లేదా బ్లాక్ రైసిన్స్‌ని నీటిలో నానబెట్టి తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు పలు విటమిన్లను కలిగిన బ్లాక్ రైసిన్స్ మలబద్దకం, కడుపు మంట, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడమే కాక రోగనిరోధక శక్తిని, జుట్టు పోషణను పెంచుతుంది.

డ్రై ఆప్రికాట్: అప్రికాట్‌లో ఫైబర్, విటమిన్ సి, ఐరన్ వంటి పోషకాలు ఉన్నందున వీటిని తీసుకోవడవం ఆరోగ్యానికి మంచిదే. అయితే జీర్ణ సమస్యలు ఉన్నవారు డ్రై అప్రికాట్స్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు దూరమవుతాయి. అలాగే ఐరన్ కారణంగా రక్తహీనత నుంచి బయట పడవచ్చు.





























