- Telugu News Photo Gallery Do You Know Health Benefits Of Consuming Fenugreek Water Daily Telugu News
Fenugreek seeds: మెంతులు చేసే మేలు అంతింత కాదండోయ్.. మధుమేహ బాధితులకు లాభాలు మెండు..!
Fenugreek seeds: చిన్నగా కనిపించే మెంతులు చేసే మేలు అంతా ఇంతా కాదు. మధుమేహం సహా అనేక అనారోగ్య సమస్యలకు మెంతులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పురాతన కాలం నుండి మెంతులను ఔషధంగా వాడుతున్నారు. మెంతి గింజలు రుచికి చేదుగా ఉన్నప్పటికీ దాని ఉపయోగాలు పుష్కలం. మెంతులను పొడి చేసుకుని తిన్నా లేదా నీటిలో నానబెట్టి తాగినా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.
Updated on: Sep 20, 2023 | 4:05 PM

అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారు మెంతులను తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించడంలో బాగా సహాయపడుతుంది. మెంతులలో ఫైబర్, విటమిన్లు, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

డయబెటీస్ తో బాధపడేవారు రోజూ మెంతుల నీటిని తాగితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. మెంతి నీరు ఆకలిని అణచివేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వు నిల్వను తగ్గిస్తుంది.

మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెంతి నీరు దాని ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. ఇది హార్మోన్ల అసమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మొటిమలను తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఛాయను తేలికపరుస్తుంది. సహజమైన కాంతిని ఇస్తుంది. మెంతి నీరు మంటను తగ్గిస్తుంది. ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వాపు సంబంధిత పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మెంతికూరలో కోలిన్, ఇనోసిటాల్, బయోటిన్, విటమిన్లు ఎ, బి, డి, విటమిన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. మెంతి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.




