Gachibowli: ఒక్క ఫోన్‌ కాల్‌తో రూ.36 లక్షలు పోగొట్టుకున్న టాప్‌ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్

ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినందుకు హైదరాబాది ప్రొఫెసర్ ఏకంగా 36 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. జీవిత కాలపు సేవింగ్స్ మొత్తం నేరగాళ్లకు చెల్లించింది. ఏం చేయాలో తోచక సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. పోలీసుల కథనం ప్రకారం గచ్చిబౌలి కి చెందిన 48 సంవత్సరాల ప్రొఫెసర్ ప్రముఖ సంస్థలో సీనియర్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం అశ్విన్ గౌతమ్ అనే వ్యక్తి ప్రొఫెసర్ కు కాల్ చేశాడు. తను ముంబై కొరియర్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడి ప్రొఫెసర్ పేరు మీద ఒక పార్సిల్ వచ్చినట్టు

Gachibowli: ఒక్క ఫోన్‌ కాల్‌తో రూ.36 లక్షలు పోగొట్టుకున్న టాప్‌ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్
Cyber Criminals
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srilakshmi C

Updated on: Sep 22, 2023 | 11:21 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22: ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేసినందుకు హైదరాబాది ప్రొఫెసర్ ఏకంగా 36 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. జీవిత కాలపు సేవింగ్స్ మొత్తం నేరగాళ్లకు చెల్లించింది. ఏం చేయాలో తోచక సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. పోలీసుల కథనం ప్రకారం గచ్చిబౌలి కి చెందిన 48 సంవత్సరాల ప్రొఫెసర్ ప్రముఖ సంస్థలో సీనియర్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. సెప్టెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం అశ్విన్ గౌతమ్ అనే వ్యక్తి ప్రొఫెసర్ కు కాల్ చేశాడు. తను ముంబై కొరియర్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నట్టు మాట్లాడి ప్రొఫెసర్ పేరు మీద ఒక పార్సిల్ వచ్చినట్టు మాట్లాడాడు. ముంబై నుండి తైవాన్ కు పార్సెల్ చేయాల్సిందిగా ప్రొఫెసర్ పేరు మీద అడ్రస్ ఉన్నట్టు మాట్లాడాడు. కానీ ఆ పార్సెల్ లో అనుమానాస్పద వస్తువులు ఉండటంతో తాను ఫోన్ చేస్తున్నట్టు ప్రొఫెసర్ కు చెప్పాడు. నాలుగు పాస్‌పోర్ట్‌ లతోపాటు రెండు క్రెడిట్ కార్డులు ల్యాప్టాప్ లు, ఎండిఎంఏ డ్రగ్స్ ప్యాకెట్లు ఉన్నట్లు కాల్ చేశాడు. ఈ పార్సెల్ కోసం హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా 15 వేల రూపాయలను అప్పటికే చెల్లించినట్టు ప్రొఫెసర్ ను నమ్మించాడు.

దీంతోపాటు ప్రొఫెసర్ కు సంబంధించిన కరెక్ట్ అడ్రస్, ప్రొఫెసర్ ఆధార్ నంబర్, ఆమె ఫోన్ నెంబర్ అన్ని తెలపడంతో ప్రొఫెసర్ ఆశ్చర్యపోయింది. తాను ఎలాంటి పార్సెల్ బుక్ చేయలేదని కాలర్ కు చెప్పింది. తన పేరు ఉపయోగించి వేరే వ్యక్తులు పార్సల్ బుక్ చేసి ఉండొచ్చని కాలర్ కు బదులిచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయమని కాలర్ ప్రొఫెసర్ కు సలహా ఇచ్చాడు. అయితే పోలీసులకు సైతం తామే ఫోన్ కలుపుతామని ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ లో తనకు పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ప్రొఫెసర్ కాల్ లో ఉండగానే ప్రకాష్ కుమార్ అనే వ్యక్తి ప్రొఫెసర్ కు ఫోన్ చేశాడు. తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అంటూ ప్రొఫెసర్ తో మాట్లాడాడు. ప్రొఫెసర్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నాడు. అయితే ప్రొఫెసర్ హైదరాబాదులో ఉన్న అని చెప్పడంతో రావాల్సిందిగా నమ్మించాడు ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రకాష్. దీంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ లోగోతో ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో యూనిఫామ్ ధరించి ప్రొఫెసర్ తో స్కైప్ లో మాట్లాడాడు ఫేక్ ఐపీఎస్. అతడు నిజమైన ఐపీఎస్ అని నమ్మిన ప్రొఫెసర్ తన ఆధార్ కార్డు తో పాటు మరిన్ని వివరాలు తీసుకున్నాడు.

మహమ్మద్ నవాబ్ ఇస్లాం అనే నిందితుడితో ప్రొఫెసర్ కు జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టు ప్రొఫెసర్ ను నమ్మించాడు. మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి లో అతడిని అరెస్టు చేసినట్టు నమ్మించాడు. నవాబుతోపాటు పార్సిల్ ఫోటోను చూపించి ఇది చాలా సీరియస్ క్రైమ్ అని ప్రొఫెసర్ ను భయపెట్టాడు. ఆ తర్వాత తన సీనియర్ ఆఫీసర్ రాజ్పుట్ ప్రొఫెసర్ తో మాట్లాడుతాడు అని కాల్ కట్ చేశాడు. సెప్టెంబర్ 19న రాజ్పుట్ పేరుతో మరో వ్యక్తి ఫోన్ చేశాడు.. ప్రొఫెసర్ కు తన బ్యాంక్ అకౌంట్ లను దర్యాప్తు సంస్థలు వెరిఫై చేస్తాయని నమ్మించి తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఒక అకౌంట్ నెంబర్ కి సెండ్ చేయాలని సలహా ఇచ్చాడు. అదే నిజమో అని నమ్మిన ప్రొఫెసర్ బ్యాంకు కి వెళ్లి 36.7 లక్షల రూపాయల నగదును ఎండి కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు బదిలీ చేసింది.

ఇవి కూడా చదవండి

నగదు బదిలీ చేసిన తర్వాత బాధితురాలితో ఎలాంటి కమ్యూనికేషన్ నిందితులకు లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సాయంత్రం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి