Kurnool Volunteer Murder Case: అదోని గ్రామ వాలంటీర్ దారుణ హత్య.. అర్ధరాత్రి రాళ్లతో కొట్టి చంపిన దుండగులు..
కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోనిలో దారుణం జరిగింది. ఆదోని వాలంటీర్ హరిబాబు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వాలటీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో గాయపరిచారిచి హత మార్చారు. తలకు బలమైన గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మృతి చెందాడు. హత్యకు గురైన హరిబాబు మండిగిరి సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదోని డీఎస్సీ శివ నారాయణ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు..
ఆదోని, సెప్టెంబర్ 21: కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోనిలో దారుణం జరిగింది. ఆదోని వాలంటీర్ హరిబాబు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. వాలటీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో గాయపరిచారిచి హత మార్చారు. తలకు బలమైన గాయం తగలడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి మృతి చెందాడు. హత్యకు గురైన హరిబాబు మండిగిరి సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదోని డీఎస్సీ శివ నారాయణ స్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలేం జరిగిందంటే..
రాజీవ్‌గాంధీ గాంధీనగర్‌లో నివాసం ఉంటోన్న వాలంటీర్ హరిబాబు బుధవారం రాత్రి (సెప్టెంబర్ 20) హత్యకు గురయ్యాడు. వాలంటీర్ హరిబాబును పలువురు దుండగులు రాళ్లతో తీవ్రంగా కొట్టి చంపారు. హత్యకు గల కారణలు ఇంకా తెలియరాలేదు. మూత్ర విసర్జనకు బుధవారం అర్ధరాత్రి బయటికి వెళ్లిన వాలంటీర్ హరిబాబు ఎంతకూ రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పరిశీలించగా నేలపై రక్తపు మడుగులో విగత జీవిగా పడివున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం (సెప్టెంబర్ 21) ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు మీడియాకు తెలిపారు.
హైదరాబాద్‌లో మరో ఘటన.. పోలీస్ దర్యాప్తుకు భయపడి భవనంపై దూకిన యువకుడు
ఓ హత్య కేసులో భాగంగా విచారించేందుకు వచ్చిన పోలీసులను చూసి భయపడి ఓ యువకుడు తాను నివాసం ఉంటోన్న హాస్టల్ పక్క భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో సోమవారం ఈ ఘటన జరగగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఈదరపల్లికి చెందిన పోలిశెట్టి కిశోర్, అడపా సాయి లక్ష్మణ్ అనే ఇద్దరు వ్యక్తులపై సెప్టెంబరు 1న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలిశెట్టి కిశోర్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ హత్యలో నిందితుల ఆచూకీ కోసం గాలిస్తోన్న పోలీసులు సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉద్యోగం చేస్తున్న పోలిశెట్టి ఫణిశంకర్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఫణిశంకర్ తనకేమీ తెలియదని, కేపీహెచ్‌బీలో ఉండే ఫార్మా ఉద్యోగి మాచిరాజు ఫణి శ్రీనివాస్ (25) పేరును పోలీసులకు తెలిపాడు. కేపీహెచ్‌బీలోని శ్రీబాలాజీ హాస్టల్‌లో నివాసం ఉంటోన్న ఫణిశ్రీనివాస్ వద్దకు రాత్రి 8.30 గంటలకు వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న ఫణి శ్రీనివాసం తన గదికి తాళం వేసి భయంతో నాలుగో అంతస్తు నుంచి పక్కనున్న భవనంపైకి దూకేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి పడిపోయిన శ్రీనివాస్ పెంట్‌హౌస్‌పై తీవ్రగాయాలతో పడి ఉండగా ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.