AP Assembly Session: మీసం తిప్పిన బాలకృష్ణ.. అంబటి రాంబాబు అభ్యంతరం.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా..

Shaik Madar Saheb

|

Updated on: Sep 21, 2023 | 1:15 PM

AP Assembly Session: ఓ వైపు స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ-టీడీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తుంటే... మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఈ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హాజరయింది. సమావేశాలు ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్టుపై చర్చచేపట్టాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

AP Assembly Session: ఓ వైపు స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో వైసీపీ-టీడీపీ మధ్య మాటలయుద్ధం నడుస్తుంటే… మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ఈ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హాజరయింది. సమావేశాలు ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్టుపై చర్చచేపట్టాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. స్పీకర్ పొడియం చుట్టూ చేరి ఆందోళన చేపట్టారు. దీంతో ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా…వైసీపీ నేతలు అడ్డుకునే పని చేశారు. స్పీకర్ తీరును తప్పు పట్టారు టీడీపీ నేతలు. అనంతరం పొడియాన్ని చుట్టుముట్టూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సమావేశాలు స్పీకర్ వాయిదా వేశారు.

అసెంబ్లీ సమావేశాలు వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 21, 2023 09:22 AM