AP Assembly: తొడగొట్టిన బాలయ్య.. స్పీకర్ తమ్మినేని వార్నింగ్..
అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తొడలు చరచడం, మీసాలు మెలి వెయ్యడం చేష్టలు సభలో కరెక్ట్ కాదన్నారు. సభా సంప్రదాయాలకు బాలకృష్ణ తిలోదకాలు ఇచ్చారన్నారు. ఇలాంటి చర్యలు రిపీట్ అవ్వకుండా చూడాలని బాలయ్యను హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని.
ఏపీ అసెంబ్లీ అట్టుడికిపోయింది!. ఉభయ సభలూ అరుపులు కేకలతో దద్దరిల్లిపోయాయ్!. అసెంబ్లీ ప్రారంభం కావడం కావడమే రగడ మొదలైంది. ప్లకార్డులతో సభలోకి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చీరాగానే ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నినాదాలు చేశారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో అసలు రచ్చ మొదలైంది. బాబు అరెస్ట్‌పై చర్చ చేపట్టాల్సిందేనంటూ నినాదాలతో హోరెత్తించారు టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ పోడియం దగ్గరకెళ్లి ఆందోళనకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ ఛైర్‌ను సైతం చుట్టుముట్టడంతో సభలో హైటెన్షన్ కొనసాగింది. కాగా బాబు అరెస్ట్‌పై సభలో ఆందోళన చేసిన.. 14 మంది టీడీపీ సభ్యులు, వైసీపీకు చెందిన ఉండవల్లి శ్రీదేవిని ఈరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై చర్చకు సరైన ఫార్మాట్‌లో రావాలని శాసనసభ వ్యవహారాల మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ శాసనసభ్యులను మరోసారి కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

