భారత పార్లమెంట్ చరిత్రలో సువర్ణాధ్యాయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఏమన్నారంటే..

Shaik Madar Saheb

|

Updated on: Sep 20, 2023 | 2:03 PM

భారత పార్లమెంటరీ చరిత్రలో ఇవాళ బిగ్‌డే.. ప్రజాస్వామ్య భారతాన నవశకం మొదలుకాబోతోంది.. ఆకాశంలో సగం, అన్నింటా సగమని గౌరవించుకునే మన మహిళా లోకానికి భారత పార్లమెంట్‌ పెద్దపీట వేయబోతోంది. ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌ పడుతూ వస్తోన్న మహిళా బిల్లుకు ఇవాళ మోక్షం లభించబోతోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం లోక్‌సభలో సుధీర్ఘ చర్చ ప్రారంభమైంది. సుమారు 7గంటలపాటు ఈ చర్చ కొనసాగనుంది.

భారత పార్లమెంటరీ చరిత్రలో ఇవాళ బిగ్‌డే.. ప్రజాస్వామ్య భారతాన నవశకం మొదలుకాబోతోంది.. ఆకాశంలో సగం, అన్నింటా సగమని గౌరవించుకునే మన మహిళా లోకానికి భారత పార్లమెంట్‌ పెద్దపీట వేయబోతోంది. ఐదు దశాబ్దాలుగా పెండింగ్‌ పడుతూ వస్తోన్న మహిళా బిల్లుకు ఇవాళ మోక్షం లభించబోతోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం లోక్‌సభలో సుధీర్ఘ చర్చ ప్రారంభమైంది. సుమారు 7గంటలపాటు ఈ చర్చ కొనసాగనుంది. మహిళా బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మహిళా బిల్లు ఆమోదం లాంఛనం కానుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన నారీశక్తి వందన్‌ బిల్లును పార్లమెంట్ ఆమోదం అనంతరం రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. పార్లమెంట్‌లోని లోక్ సభలో నారీశక్తి వందన్‌ అధినియమ్‌ బిల్లుపై చర్చ మొదలైంది. ఈ బిల్లుపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, పలు పార్టీల లోక్ సభా పక్ష నేతలు మాట్లాడనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 20, 2023 11:19 AM