IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థికి రూ.3.7 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో రికార్డుల మోత

ఐఐటీ ముంబైలో ఇటీవల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు జరిగాయి. ఈ యానువల్‌ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్ధులు సత్తా చాటారు. రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఓ విద్యార్ధి ఇంటర్నేషనల్‌ జాబ్‌ ఆఫర్‌ దక్కినట్లు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని మరో విదేశీ సంస్థ నుంచి మరో విద్యార్థిని రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ రెండు ఆఫర్‌లను విద్యార్ధులు అంగీకరించినట్లు ఐఐటీ బాంబే తన ప్రకటనలో తెల్పింది..

IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థికి రూ.3.7 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో రికార్డుల మోత
IIT Bombay
Follow us

|

Updated on: Sep 20, 2023 | 7:37 AM

ముంబాయి, సెప్టెంబర్‌ 20: ఐఐటీ ముంబైలో ఇటీవల క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు జరిగాయి. ఈ యానువల్‌ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే విద్యార్ధులు సత్తా చాటారు. రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఓ విద్యార్ధి ఇంటర్నేషనల్‌ జాబ్‌ ఆఫర్‌ దక్కినట్లు ఐఐటీ బాంబే ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని మరో విదేశీ సంస్థ నుంచి మరో విద్యార్థిని రూ. 1.7 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. ఈ రెండు ఆఫర్‌లను విద్యార్ధులు అంగీకరించినట్లు ఐఐటీ బాంబే తన ప్రకటనలో తెల్పింది. ప్రతీ యేట IIT బాంబే క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో విద్యార్ధులు అత్యధిక వేతనంతో కూడిన జాబ్స్‌ సాధిస్తుంటారని గత ఏడాది రూ.2.1 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్ రాగా ఈ ఏడాది ఏకంగా రూ.3.7 వేతనంతో కొలువు సాధించినట్లు తెల్పింది. అయితే ఈ ఆఫర్లు పొందిన విద్యార్థుల పేర్లను మాత్రం ఇన్‌స్టిట్యూట్ బహిర్గతం చేయలేదు.

రూ. 1 కోటి కంటే ఎక్కువ వార్షిక వేతనాలతో దాదాపు పదహారు ఉద్యోగ ఆఫర్‌లను IIT-బాంబే విద్యార్థులను వరించాయి. 2022-23 ప్లేస్‌మెంట్‌లలో 300 ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌లలో 194 జాబ్స్‌ విద్యార్ధులకు దక్కించుకున్నారు. జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లలో 2,174 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 1,845 మంది ప్లేస్‌మెంట్‌లలో పాల్గొన్నారు. ఇక ఐఐటీ బాంబే విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, తైవాన్‌లలో దాదాపు 65 విదేశీ ఫారెన్‌ జాబ్‌ ఆఫర్‌లను అందుకున్నారు.

2021-2022 ప్లేస్‌మెంట్ సీజన్‌లో విద్యార్ధుల సగటు ప్యాకేజీ ఏడాదికి రూ.21.50 లక్షలు, 2020-2021 ప్లేస్‌మెంట్ సీజన్‌లో విద్యార్ధుల సగటు ప్యాకేజీ ఏడాదికి రూ.17.91 లక్షలు, 2022-2023 ప్లేస్‌మెంట్ సీజన్‌లో సగటు ప్యాకేజీ రూ. 21.82 లక్షలుగా నమోదైనట్లు IIT-బాంబే తెలిపింది. ఇలా ప్రతీయేటా గణనీయమైన పెరుగుదలతో విద్యార్ధులు ఉద్యోగాలు పొంతున్నారు.

ఇవి కూడా చదవండి

గతేడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో తక్కువ మంది విద్యార్థులను ఆయా కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాయి. ఐటీ/సాఫ్ట్‌వేర్ రంగంలోని 88కి పైగా కంపెనీల నుంచి 302 మంది విద్యార్థులు జాబ్ ఆఫర్‌లను పొందారు. ట్రేడింగ్, ఫైనాన్స్, ఫిన్‌టెక్ కంపెనీలు ప్రధాన రిక్రూటర్‌లుగా నిలిచాయి. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, మొబిలిటీ, డేటా సైన్స్, ఎనలిటిక్స్ అండ్‌ ఎడ్యుకేషన్‌లో విభాగాల్లో అధిక డిమాండ్ రావడం విశేషం.2022-23 ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న 82 శాతం మంది విద్యార్థుల్లో బీటెక్, డ్యూయల్ డిగ్రీ, ఎంటెక్ డిగ్రీల నుంచి దాదాపు 90 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ