AP Governor: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు శస్త్ర చికిత్స.. గవర్నర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (65) సోమవారం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్ అధికారుల సమాచారం అందించడంతో వైద్యులు తొలుత విజయవాడకు వెల్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరవల్సిందిగా సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు తాడేపల్లిలోని మనిపాల్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పరీక్షల అనంతరం..
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (65) సోమవారం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రాజ్‌భవన్ అధికారుల సమాచారం అందించడంతో వైద్యులు తొలుత విజయవాడకు వెల్లి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరవల్సిందిగా సూచించారు. వైద్య నిపుణుల సూచన మేరకు తాడేపల్లిలోని మనిపాల్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పరీక్షల అనంతరం ఆయనకు అపెండిసైటిస్ ఉన్నట్లు తేల్చారు.
దీంతో అదే ఆసుపత్రిలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు రోబోటిక్ విధానం (రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ) ద్వారా వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మనిపాల్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన సీఎం జగన్
గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అపెండిసైటిస్ కారణంగా శస్త్ర చికిత్స చేసినట్లు సీఎంకు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు పేర్కొన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
తిరుమల పర్యటన.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తిరుపతి తిరుమల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. సోమవారం స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగరాయలు మండపంలో టీటీడీ క్యాలెండర్ 2024, డైరీలను ఆవిష్కరించారు. రాత్రి 8 గంటలకు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. తిరుమల పర్యటన ఉండగానే గవర్నర్ అస్వస్థత సమాచారం అందుకున్న సీఎం జగన్ వెంటనే అధికారులతో మాట్లాడి ఆయన యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.